సింగిల్ పేరెంట్ కూడా దత్తత తీసుకోవచ్చు
అలహబాద్ హైకోర్టు తీర్పు
లక్నో,ఫిబ్రవరి23 (జనం సాక్షి) : పిల్లలను దత్తత తీసుకోవడానికి వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం సింగిల్ పేరెంట్ కూడా బిడ్డను దత్తత తీసుకోవచ్చని తెలిపింది. పిల్లల దత్తతకు సంబంధించిన ఒక కేసు విచారణపై ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు వెల్లడిరచింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ట్రాన్స్‌జెండర్ రీనా కిన్నార్, 2000 డిసెంబర్ 16న ఒక యువకుడ్ని పెండ్లి చేసుకుంది. ఈ జంట ఒక
బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించింది. బిడ్డ దత్తత కోసం సంబంధిత అధికారులను వారు ఆశ్రయించారు. అయితే పిల్లల దత్తత కోసం వివాహ ధృవీకరణ పత్రం అవసరమని చెప్పారు. దీంతో రీనా జంట తమ వివాహం నమోదు కోసం వారణాసి జ్లిలా సబ్ రిజిస్టర్ర్‌కు ఆన్‌లైన్ ద్వారా 2021 డిసెంబర్‌లో దరఖాస్తు చేశారు. అయితే అది పెండిరగ్‌లో ఉండటంతో అలహాబాద్ హైకోర్టును వారు ఆశ్రయించారు.
ఈ నెల 9న జస్టిస్ వివేక్ వర్మ, జస్టిస్ డాక్టర్ కౌశల్ జయేంద్ర ఠాకర్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. పిల్లలను దత్తత తీసుకోవడానికి వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదని ఆ బెంచ్ తెలిపింది. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం సింగిల్ పేరెంట్ కూడా బిడ్డను దత్తత తీసుకోవచ్చని స్పష్టం చేసింది.