సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా

గవర్నర్‌కు లేఖ అందజేత

ముంబయి,నవంబర్ 8(జనంసాక్షి): మహారాష్ట్ర సీఎం పదవికి దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేశారు. శుక్రవారం మధ్యాహ్నం భాజపా సీనియర్ మంత్రులతో కలిసి రాజ్ భవనకు వెళ్లిన ఆయన గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి రాజీనామా పత్రం సమర్పించారు. గవర్నర్ తన రాజీనామాను ఆమోదించినట్లుగా అనంతరం ఫడణవీస్ ప్రకటించారు. ఈ ఏదేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, ఇందుకు సహకరించిన పార్టీ సహచరులకు, శివసేన నేతలకు ఆయన ధన్యావాదాలు తెలిపారు . ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ రోజు అర్ధరాత్రితో ముగియనున్న సంగతి తెలిసిందే . కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ఇంకా సందిగ్ధం కొనసాగుతున్నందున రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మిత్ర పక్షాలైన భాజపా, శివసేన కూటమి స్పష్టమైన మెజారిటీతో విజయం పంచుకోవాలనే శివసేన డిమాండ్ కు భాజపా సాధించినా, అధికార పీఠం విషయంలో ఇరు అంగీకరించడం లేదు. ఈసారి కూడా పూర్తి వర్గాల మధ్య పొరపొచ్చాలు తలెత్తిన సంగతి కాలం తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తెలిసిందే . సీఎం పదవిని చెరి సగం కాలం ఫడణవీస్ గతంలో – గవర్నర్‌కు లేఖ స్పష్టం చేశారు . శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి, కీలక మంత్రి పదవులు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అయినా, శివసేన 50:50 ఫార్ములాకు కట్టుబడి ఉంది. అక్టోబరు 24న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో భాజపా 105 సీట్లు గెల్చుకున్న సంగతి తెలిసిందే . శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెల్చుకున్నాయి. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీలు, స్వతంత్రులు గెలుపొందారు. కాగా ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడడానికి శివసేనే కారణమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఆరోపించారు. అసెంబ్లీ పదవీకాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఆయన తన రాజీనామూను గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి సమర్పించారు . అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శివసేనపై విమర్శలు గుప్పించారు .“శివసేన చెబుతున్నట్లు సీఎం పదవిపై ఎలాంటి ఒప్పందమూ కుదరలేదు. నా సమక్షంలో అలాంటిదేమీ జరగలేదు. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభనకు శివసేనే కారణం. నేను ఎన్నోసార్లు ప్రయత్నించినా ఉద్దవ్ | నాతో మాట్లాడలేదు. కానీ ప్రత్యామ్నాయమంటూ ఎన్సీపీ, కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారు” అని ఫడణవీస్ ఆరోపించారు . “గత 15 రోజులుగా శివసేన చేస్తున్న ప్రకటనలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మోదీపై కూడా విమర్శలు చేశారు. కానీ భాజపా నేతలెప్పుడూ బాఠాక్రేని గానీ, ఉద్దవు ‘ గానీ విమర్శించలేదు. మోదీని ప్రతిపక్ష నేతలు కూడా ఎప్పుడూ అలా దూషించలేదు. ఆ పార్టీ వైఖరి చూస్తుంటే కూటమిలో ఉండడం ఇష్టం లేదని పిస్తోంది” అని ఫడణవీస్ అన్నారు ఫడణవీస్ వ్యాఖ్యలపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. తమతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే ముఖ్యమంత్రి పీఠంపై శివసేన నేత ఉండాలన్నారు . ఒకవేళ తన నేతృత్వంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఫడణవీస్ భావిస్తే ఆయనకు తన శుభాకాంక్షలు అని రౌత్ వ్యంగ్యంగా అన్నారు . మోదీ, అమిత్ షా పై అనవసరంగా విమర్శలు గుప్పించారన్న ఫడణవీస్ ఆరోపణలను తోసిపుచ్చారు .