సుధీర్ఘకాలం తరువాత..  ఫీల్డ్‌ లోకి గోవా సీఎం పారికర్‌ 


– మాండవి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జిని పరిశీలించిన పారికర్‌
– బీజేపీ తీరుపై మండిపడుతున్న విపక్షాలు
పనాజీ, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అనేక నెలల తరువాత తొలిసారిగా బైటికి వచ్చారు. మాండవి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. పారికర్‌ వెంట ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు కూడా ఉన్నారు. పాంక్రియాటిక్‌ కేన్సర్‌తో బాధపడుతున్న పారికర్‌ ఇటీవల కాలమంతా ఆసుపత్రుల్లోనే గడుపుతూ వచ్చారు. ఒక దశలో గోవాలో పరిపాలన స్తంభించిందని, ముఖ్యమంత్రిని మార్చాలని విపక్షాల నేతలు డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రిని మార్చాలని బిజెపి నేతలు కూడా ముఖ్యమంత్రిని మార్చాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో పారికర్‌ తొలిసారిగా ఇంటినుంచి వెలుపలికి వచ్చి మాండవి నదిపై నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు. ఇదిలా ఉంటే మనోహర్‌ పారికర్‌ను సొంత పార్టీల నేతలు అభినందిస్తుంటే.. విపక్షాలు మాత్రం పదవీ వ్యామోహం అవసరమా అంటూ తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా సీనియర్‌ నాయకురాలు ప్రీతి గాంధీ మాట్లాడుతూ.. నిబద్ధతకు, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం అంటూ పారికర్‌ని ప్రశంసించారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం బీజేపీ అధికార దాహానికి నిలువెత్తు నిదర్శనమంటూ ఆరోపణలు చేస్తున్నాయి. ‘ఎంత అమానుషం.. పూర్తిగా కోలుకొని మనిషిని బాధ్యతలు నిర్వహించమని, ఫోటోలకు ఫోజులివ్వమని ఒత్తిడి చేయడం దారుణమం’టూ జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్షుడు ఓమర్‌ అబ్దుల్లా విమర్శించారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కూడా ‘సీఎం ముక్కులో ట్యూబ్‌ ఉందా? పదవి దాహంతో ఉన్న పార్టీ(బీజేపీ) ఓ వ్యక్తి అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా బాధ్యతలు నిర్వహించమని కోరుతుందా? కానీ అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఏమైనా చేయగలదు అంటూ తీవ్రంగా విమర్శిచారు. సీఎం సాబ్‌ జాగ్రత్త.. ఇక విూ పార్టీ గిమ్మిక్కులు కొనసాగవు అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.