సుప్రీం గడపదొక్కిన రమణదీక్షితులు

హైకోర్టుకు వెళ్లాలని ధర్మాసనం సూచన
న్యూఢిల్లీ,జనవరి3(జ‌నంసాక్షి):  తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తనను మళ్లీ ఉద్యోగంలోకి తసీఉకోవాలని టిటిడిని ఆదేవించాలని కోరుతూ సుప్రీంకోర్టు గడప దొక్కారు.  అక్రమంగా తనను అర్చక పదవి నుంచి తొలగించారంటూ రమణ దీక్షితులు వేసిన పిటిషన్‌పై సుప్రీంలో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ పిటిషన్‌పై హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం సూచించింది. ముందుగా హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారంటూ రమణ దీక్షితులు తరపు న్యాయవాదిని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌  ప్రశ్నించారు. అయితే అక్కడ న్యాయం జరగదనే ఉద్దేశంతోనే ఇక్కడి వచ్చామని, గతంలో హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అభ్యంతరకంగా ఉందంటూ వాదించారు. ఏది ఏమైనా ఈ పిటిషన్‌పై ముందుగా హైకోర్టులో విచారణ జరిగిన తర్వాతే సుప్రీంకోర్టుకు రావాలని ధర్మాసనం స్పష్టం చేసింది.