సౌర విద్యుత్‌ పరికరాల కంపెనీలను భారత్‌కు ఆహ్వానించిన ప్రధాని

న్యూఢిల్లీ : 2017 నాటికి అదనంగా 10 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తిని సాధిస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వెల్లడించారు. ఢిల్లీలో జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ సోలార్‌ మిషన్‌ను ఆయన ప్రారంభించారు. సౌర విద్యుత్‌ పరికరాలు తయారు చేసే కంపెనీలను ప్రధాని భారత్‌కు ఆహ్వానించారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 2017 నాటికి 55 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని సాధిస్తామని చెప్పారు. కర్బన వాయు ఉద్గారాలకు బాధ్యత వహించాల్సింది పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలేనని వెల్లడించారు.