స్వయం సహాయ సంఘ కార్యకలాపాలు బలోపేతం చేయాలి….
జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్ 20(జనం సాక్షి):స్వయం సహాయ సంఘాల కార్యకలాపాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అధికారులు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని రాష్ట్ర సెర్ఫ్ సంచాలకులు వై ఎన్ రెడ్డి కోరారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డిపిఎం,ఏపీఎం, సీసీలతో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి డి ఆర్ డి ఏ పీడీ అధ్యక్షతన రాష్ట్ర సంచాలకులు సెర్ఫ్ కార్యకలాపాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచాలకులు మాట్లాడుతూ సిఐఎఫ్ సామాజిక పెట్టుబడి నిధి, స్వయం సహాయ సంఘాల బ్యాంకు లింకేజీ పంపిణీ, వ్యాపారాల గ్రౌండింగ్, సంఘాలకుఇవ్వాల్సిన నిధుల చెల్లింపులు, జిల్లా స్థాయిలో మినీ సూపర్ మార్కెట్, గ్రామస్థాయిలో రూరల్ మార్ట్ లను ఏర్పాటు చేయడం , ప్రతి గ్రామంలో వ్యాపార సమన్వయకర్తలుగా బ్యాంకులతో అనుసంధానంతో నియమించడం , స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన అప్పులపై ఎన్పీఏ లేకుండా సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవడం ప్రణాళిక బద్ధంగా జరగాలన్నారు.అలాంటప్పుడే సెల్ఫ్ కార్యకలాపాలు బలోపేతం అవుతాయని స్వయం సహాయక సంఘాలు కూడా ఆర్థికంగా పుంజుకుంటారని అన్నారు. స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలను వివోలు అకౌంటింగ్ లో డిజిటలైజేషన్ పెంపొందిస్తూ రోజువారి చెల్లింపులు లావా దేవీలు ఆన్లైన్ ద్వారా జరిగేలా సరి చేయగలిగితే పారదర్శకత పెంచినట్లు అవుతుందని, తద్వారా జవాబుదారి దినం పెంపొందుతుందన్నారు.
సామాజిక పెట్టు బడి నిధిలో వెనుకబడిన జాఫర్గాడ్, కొడకండ్ల, బచ్చన్నపేట, దేవరుప్పుల మండలాలు ముందంజలో ఉండేలా సమీక్షలు చేపట్టాలన్నారు. అలాగే ఉత్తమంగా కొనసాగుతున్న రఘునాథపల్లి, చిలుపూరు, జనగాం, లింగాల గణపూరు మండలాలను ఆదర్శ మండలాలుగా తెలియజేసి వెనుకబడిన మండలాలను బలోపేతం చేయాలన్నారు.బ్యాంకు లింకేజీలో స్టేషన్గన్పూర్, చిలుపూరు, తరిగొప్పుల, కొడకండ్ల మండలాలను ముందంజలో ఉంచేందుకు ఆదర్శ మండలాలుగా కొనసాగుతున్న బచ్చన్నపేట, జనగాం, నర్మెట్ట, రఘునాథపల్లి, పాలకుర్తి మండలాల పనితీరును తెలియ జేయాలన్నారు.సకాలంలో చెల్లింపులు జరగని దేవరుప్పల, స్టేషన్ ఘన్పూర్, రఘునాథపల్లి, తరిగొప్పుల మండలాలు కూడా బలోపేతం చేసేందుకు బాగా పనిచేస్తున్న చిలుపూరు, బచ్చన్నపేట, నర్మెట్ట, పాలకుర్తి ఆదర్శ మండలాల నిర్వహణ తీరును తెలియపరచాలన్నారు.
డిజిటలైజేషన్లో వెనుకబడిన నర్మెట్ట, కొడకండ్ల, జాఫర్గడ్, దేవరుప్పల మండలాలను సాంకేతికపరంగా చైతన్య వంతులను చేసేందుకు బాగా పనిచేస్తున్న రఘునాథపల్లి, చిలుపూరు, బచ్చన్నపేట, జనగాం మండలాల పని తీరును తెలియపరచాలని అన్నారు. వ్యాపార రంగాలలో కూడా కొడకండ్ల, దేవరుప్పల, నర్మెట్ట, స్టేషన్గన్పూర్ మండలాలు ముందంజలో ఉంచేందుకు బాగా వ్యాపారంలో దూసుకు వెళుతున్న జనగాం, రఘునాథపల్లి, తరిగొప్పుల, లింగాల ఘనపూర్ కార్యకలాపాలను తెలియజేసే విధంగా ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లో రాష్ట్రంలోనే ప్రధమంగా ఉన్నామని హ్యాండ్లూమ్స్ హ్యాండ్ క్రాఫ్ట్ లలో మరిన్ని డిజైన్లు చేపట్టి మార్కెటింగ్ చేస్తే మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు.ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డిఆర్డిఏ పిడి రాంరెడ్డి, అదనపు పీడి నూరుద్దీన్, స్వామి,వీరమల్లు, డిపిఎం, ఏపీఎం, సీసీలు తదితరులు పాల్గొన్నారు
|