హైకోర్టు విభజనపై ముగిసిన వాదనలు

u9wer4qi
తీర్పు బుధవారానికి వాయిదా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 : హైకోర్టు విభజన పిల్‌పై వాదనలు పూర్తి అయ్యాయి. శుక్రవారం పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ రాజధానిగా 10 సంవత్సరాలు ఉన్నందున ఇక్కడే హైకోర్టు ఉండాల్సిన అవసరం ఉందని కోర్టుకు స్పష్టం చేసింది. ఏపీ రాష్ట్ర పరిపాలనా విభాగం, అసెంబ్లీ, సెక్రటేరియట్‌ ఇక్కడే ఉన్నందున హైకోర్టు ఎందుకు ఉండకూడదని ఏపీ ప్రశ్నింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వాలు లిఖిత పూర్వకంగా వాదనలు ఇవ్వాలంటూ తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. అయితే ఏపీ హైకోర్టును ఉమ్మడి రాజధానిలో ఏర్పాటు చేసినా తమకు ఇబ్బంది లేదని న్యాయవాదులు చెబుతున్నారు.