యూపీలో జీపును ఢీకొట్టిన రైలు: 13 మంది మృతి

మహరాజ్‌గంజ్ : రైల్వే క్రాసింగ్ వద్ద లోకల్ ట్రైన్ జీపును ఢీ కొన్న ఘటనలో నలుగురు చిన్నారులు సహా 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. గురువారం అర్థరాత్రి జరిగిన కొతిపార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బినావానాలోని గోరఖ్‌పూర్‌‌‌‌‌‌‌‌లో ఓ పెళ్లికి వెళ్లి తిరిగి నర్కాతియా గంజ్‌‌‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన సమయంలో మొత్తం 16 మంది జీపులో ఉన్నారు. రైల్వే లైన్ క్రాసింగ్ చేస్తుండగా ట్రైన్ వచ్చి ఢీ కొట్టింది. కొంత మేరకు జీపును ముందుకు తోసుకుంటూ పోయింది.