15రోజులు కుద‌ర‌దు

 


గ‌వ‌ర్న‌ర్ నిర్న‌యానికి చెక్

రేపే బ‌లాన్ని నిరూపించుకోండి

సుప్రీంలో బిజెపికి షాక్‌
కర్నాటకలో బలం నేడు తేలిపోవాల్సిందే
శనివారం సాయంత్రం బలపరీక్ష జరగాల్సిందిగా ఆదేశాలు
ఎవరికి బలంఉంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు
కన్నడ పరిణామాలపై సుప్రీంకోర్టు ఆదేశం
నేడు 4గంటలకు బలపరీక్ష
వారం పాటు సమయం కావాలన్న ఏజీ రోహిత్గి
విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయస్థానం
సుప్రిం తీర్పు చారిత్రాత్మక నిర్ణయం
కాంగ్రెస్‌ తరుపు న్యాయవాది సింఘ్వీ
– బలపరీక్షకు తాము సిద్ధమన్న సీఎం యడ్యూరప్ప
న్యూఢిల్లీ, మే18(జ‌నం సాక్షి ) : గత మూడురోజులుగా రసవత్తరంగా సాగుతున్న కన్నడనాట రాజకీయం సుప్రీం తీర్పుతో మరింత హీటెక్కింది. అంతేగాకుండా రింత ఉత్కంఠగా మారింది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప వనివారమే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది. దీంతో కాంగ్రెస్‌ -జెడిఎస్‌ కూటమి ఆనందం వ్యక్తం చేస్తుండగా యెడ్యూరప్ప కూడా అంతే విశ్వాసంతో బలపరీక్ష ఎదుర్కొటానని ప్రకటించారు. యెడ్యూరప్ప సిఎంగా ప్రమాణస్వీకారాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ – జేడీఎస్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలంటే శనివారమే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భద్రతా కారణాల రీత్యా ఎమ్మెల్యేలు హాజరుకాని పక్షంలో డీజీపీకి తాము ఆదేశాలిస్తామని పేర్కొంది. శాసనసభలో ఎవరు బలాన్ని నిరూపించుకుంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కాంగ్రెస్‌, జేడీఎస్‌ పిటిషన్‌పై శుక్రవారం ఉదయం 10.30గంటలకు విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ యడ్యూరప్ప గవర్నర్‌ను కోరిన లేఖలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో భాజపా తరఫున వాదిస్తున్న ముకుల్‌ రోహత్గి ఆ లేఖలను కోర్టుకు అందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ తమకు ఉందని, బలపరీక్షలో దీన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రోహత్గి తెలిపారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేల నుంచి తమకు మద్దతు వస్తుందని, ఇంతకంటే ఏం చెప్పలేమన్నారు. కాగా.. గవర్నర్‌ నిర్ణయంపై సుప్రీంకోర్టు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం తేలాలంటే శనివారమే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. కోర్టు నిర్ణయానికి కాంగ్రెస్‌ – జేడీఎస్‌ సైతం అంగీకరించాయి. గవర్నర్‌ ఎవర్ని పిలిచారు అన్నదాన్ని పక్కనబెడితే బలపరీక్షే దీనికి పరిష్కారం అని భావించింది. శాసనసభలోనే బలాబలాలు తేలాలి. బలపరీక్ష శనివారమ ఏ నిర్వహించాలి’ అని న్యాయస్థానం ఆదేశించింది.ఈ సందర్భంగా ఏజీ రోహత్గి స్పందిస్తూ.. బలపరీక్ష తమకు కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఇందుకు కోర్టు నిరాకరించింది. తాము ఎవరికీ సమయం ఇవ్వాలనుకోవడం లేదని… ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారమే బలపరీక్ష నిర్వహించాలని తేల్చిచెప్పింది. సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్ధతిలో బలనిరూపణ జరగాలని ఏజీ కోరగా.. అందుకు సుప్రీం తిరస్కరించింది. దీంతో శనివారం నాలుగున్నరకు బలపరీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచి విశ్వాస పరీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్‌,జెడిఎస్‌ పార్టీలు మైదరాబాద్‌ కేంద్రంగా క్యాంప్‌ నిర్వహిస్తున్నాయి.
సుప్రీం తీర్పు చరిత్రాత్మకం: సింఘ్వి
కర్ణాటక అంశంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని కాంగ్రెస్‌ తరఫు వాదనలు వినిపించిన సింఘ్వి అన్నారు. ప్రొటెం స్పీకర్‌ ద్వారా బలపరీక్ష నిరూపించుకోవాలని న్యాయస్థానం ఆదేశించినట్లు తెలిపారు. తీర్పు సందర్భంగా కీలక అంశాలను సుప్రీంకోర్టు నిర్దేశించినట్లు వెల్లడించారు. బలపరీక్షకు ముందే ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించాలని సూచించినట్లు తెలిపారు. సభలో బలనిరూపణ ముగిసేవరకు యడ్యూరప్ప విధాన పరమైన కీలక నిర్ణయాలు తీసుకోరాదని న్యాయస్థానం ఆదేశించినట్లు సింఘ్వి తెలిపారు. సభలో ఆంగ్లో ఇండియన్‌ ఎమ్మెల్యేను నామినేట్‌ చేయరాదని కోర్టు సూచించిందని వెల్లడించారు. సభలో తమ బలాన్ని వంద శాతం నిరూపించుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బల నిరూపణకు మేం సిద్దం – సీఎం యడ్యూరప్ప
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీఎస్‌ యడ్యూరప్ప బల నిరూపణకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం బల నిరూపణ చేసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప విూడియాతో మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆదేశాలను బీజేపీ పాటిస్తుందన్నారు. మెజార్టీ సాధించేంతా ఎమ్మెల్యేల మద్దతు తమకుందని స్పష్టం చేశారు. బలపరీక్షలో 100 శాతం నెగ్గుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీ సమావేశం నిర్వహించేలా చీఫ్‌ సెక్రటరీతో చర్చిస్తానన్నారు.
సుప్రీం ఆదేశాలను స్వాగతిస్తున్నాం..
శనివారం బలనిరూపణ చేసుకోవాలనే ఆదేశాలను స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ శోభా కరాండ్లజే అన్నారు. శనివారం అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. బల నిరూపణకు తమ పార్టీ సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ల పిటిషన్లను విచారించిన జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ భూషణ్‌, జస్టిస్‌ బాబ్డేలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ శనివారం బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు బలపరీక్ష జరగనుంది.
———————————–