యోగా గురు అనుచరుడు బాలకృష్ణకు నోటీసులు

న్యూఢిల్లీ: యోగా గురు రావమ్‌దేవ్‌ బాబా సన్నిహిత అనుచరుడు బాలకృష్ణకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. ఓ ఆహార సంస్థ రూ. 4.36 కోట్లమేర విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించి లావాదేవీలు నిర్వహించినట్టు ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే పాస్‌పోర్టు కోసం తప్పుడు పత్రాలు సమర్పించారంటూ బాలకృష్ణపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసులో ఈనెల 17న బెయిలుపై విడుదలైన బాలకృష్ణను… ఫెమా కేసులో ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.