2014 లోపు సగం మందికి ఆధార్‌: నిలేకవి

వాషింగ్టన్‌:2014లోపు దేశంలో సగం మందికి అంటే సుమారు 60కోట్ల మందికి  ఆధార్‌కార్డులు ఇస్తామని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చైర్మన్‌ నందన్‌ నిలేకని మంగళవారం ఇక్కడ తెలిపారు. ఈ ఏడాది చివరిలోపు దేశంలోపు దేశంలో ప్రతి ముగ్గురిలో  ఒకరికి ఆధార్‌కార్డును అందజేస్తామని చెప్పారు. వాషింగ్టన్‌లో సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ ఏర్పాటు చేసిన రిచర్డ్‌ హెచ్‌ సబోట్‌ స్మారకోపన్యాసంలో ఆధార్‌ అనుభవాలు- సాంకేతిక అభివృద్దిలో సవాళ్లు అంశంపై ఆయన ప్రసంగించారు. ఇప్పటికే దేశంలో 38 కోట్లు మందికి గుర్తింపు సంఖ్యను కేటాయించామని వెల్లడించారు.