చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశంపై అధికార పార్టీ నాయకుల వివక్ష వీడాలి- కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ గిరి కొండల్ రెడ్డి

3వ రోజుకు చేరుకున్న రెవెన్యూ డివిజన్ దీక్షలకు సంఘీభావం

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 13 : చేర్యాల రెవెన్యూ అధికార పార్టీ నేతలు వివక్ష వీడాలని కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ గిరి కొండల్ రెడ్డి అన్నారు. బుధవారం చేర్యాల మండల కేంద్రంలో రెవెన్యూ డివిజన్ సాధనకై చేర్యాల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలు మూడవ రోజుకు చేరుకుంది ఈ దీక్షలో జాలపల్లి,ధూల్మిట్ట జేఏసీ నేతలు కూర్చోగా వారికి పూల మాలవేసి దీక్షలను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ.. ఎంతో ఘనమైన కీర్తిని కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కొన్ని సంవత్సరాలుగా ప్రజలు, జేఏసీ నాయకులు ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే,అధికార పార్టీ నేతలు మీ నాయకులపై వత్తిడి తెచ్చి ,మీ నిజాయితీని చాటుకోవాలని హెచ్చరించారు,రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం వల్ల రేపు జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన లో చేరియలను నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉంటదని తెలియజేశారు,, ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతున్నా ఈ ప్రాంత మీద పుట్టిన బిడ్డలుగా టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రెవిన్యూ డివిజన్ ఉద్యమంలో కలిసి రావాలని లేదంటే ఈ ప్రాంత నష్టాన్ని అధినాయకత్వానికి తెలియజేసి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. లేదంటే ఈ ప్రాంత ద్రోహులుగా మిగిలిపోతారని ఈ ప్రాంతం పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడు చూస్తే రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ నేతలను తరిమికొడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్, జేఏసీ కో చైర్మన్ పూర్మ ఆగం రెడ్డి, జాలపల్లి ఎంపీటీసీ చెటుకూరి కమలాకర్ యాదవ్, జేఏసీ నియోజకవర్గ నాయకుడు అందె అశోక్, గద్దల మహేందర్, సుందరగిరి భాస్కర్, ఈరి భూమయ్య, ఐలేని మహిపాల్ గౌడ్, బందారం సాగర్ గౌడ్, పోతిరెడ్డి యాదగిరి, ఎండీ. అస్మద్దీన్, రాళ్లబండి నాగరాజు, తడక లింగం, తాడెం వెంకట స్వామి, కొంగరి వెంకట స్వామి, గూడ రాజిరెడ్డి, పోతుగంటి ప్రసాద్,ఎగుర్ల ఎల్లయ్య, జంగిలి యాదగిరి, బోయిని మల్లేశం, బండ్ల లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు