సీజనల్ వ్యాధుల పట్ల దృష్టి సారించండి-జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

టేకులపల్లి,సెప్టెంబర్ 14( జనం సాక్షి): సీజనల్ వ్యాధుల పట్ల వైద్య, మండల, గ్రామపంచాయతీ అధికారులు అప్రమత్తమై ప్రత్యేకంగా దృష్టి సారించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య సూచించారు. టేకులపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భూక్య రాధా అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. విద్య వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలను నోట్ చేసుకొని, తిరిగి మరల పెట్టే సమావేశంలో అధికారులు జవాబుదారీగా ఉండాలని, ప్రశ్నించిన సభ్యులకు తెలియపరచాలన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని అన్నారు. సమావేశంలో విద్యుత్తు, విద్యపై, పెండింగ్ లో ఉన్న పోడు పట్టాలపై, పోడు పట్టాలు పొందిన భూములలో గిరి వికాస పథకం అమలుపై ఫారెస్ట్ అధికారుల అడ్డంకుల గురించి చర్చించారు.వ్యవసాయం, ఇందిరా క్రాంతి పథకం తదితర శాఖల అమలు తీరుపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీడీవోకె వీరబాబు, తహసిల్దార్ కృష్ణవేణి, బేతంపూడి సొసైటీ అధ్యక్షులు లక్కినేని సురేందర్ రావు, మండల పరిషత్ అధికారులతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

తాజావార్తలు