పోషకాహార వారోత్సవాలు
మోత్కూరు సెప్టెంబర్ 14 జనం సాక్షి : మోత్కూరు మండలం లోని పొడిచేడు గ్రామంలో అంగన్ వాడి కేంద్రం లో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గర్భిణీ స్త్రీలకు శ్రిమంతం చేశారు. అంగన్ వాడి టీచర్ కలమ్మ మాట్లాడుతూ కడుపు లో ఉన్న బిడ్డ ఎదుగుదలకు తోడ్పటు గా గర్భిణీ స్త్రీలు సంపూర్ణ పోషకాహారం తీసుకోవాలని, ఆకుకూరలు , పాలు,పండ్లు , కూరగాయలు, గుడ్లు , పచ్చి మొలకెత్తిన విత్తనాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ ఎమ్. ప్రతిమ, ఉపాధ్యాయునులు ఉమా, వాణి,ఆరోగ్య సిబ్బంది దివ్య,రజిత, నర్రె స్వప్న, మల్లం లక్ష్మి,కల్యాణి,మమత, అనూష,శ్రావణి, లక్ష్మి, రజియా,రమణమ్మ, ఆయా మల్లమ్మ,గర్భిణీ స్త్రీలు,తల్లులు తదితరులు పాల్గొన్నారు