రఘునాథ పాలెం సెప్టెంబర్ 21 (జనం సాక్షి)
చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించడం హర్షనీయం అని బి.ఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ అన్నారు చారిత్రాత్మకమైన ఈ మహిళ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించడం అభినందనీయమని లింగాల అన్నారు ఈ 33 శాతం రిజర్వేషన్ అన్ని కులాలకు సంబంధించిన మహిళలకు జనాభా ప్రాతిపదికన కేటాయించే విధంగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు అవకాశాలు కల్పించాలని పార్లమెంట్ లో ఎంతో పోరాటం చేశారని నాడు హిందూ సాంప్రదాయాలకు కట్టుబాట్లకు మహిళలు అనేక సంవత్సరాలు ఇంటికే పరిమితమై అణచివేయబడ్డారని తర్వాత కాలంలో అంబేద్కర్ స్ఫూర్తితో అనేక హక్కులు అవకాశాలు కల్పించబడ్డాయని తెలిపారు నేడు పార్లమెంట్ శాసనసభ వ్యవస్థలో మహిళల కు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మహిళలు రాజకీయంగా మరింత అభివృద్ధిని సాధిస్తారని మహిళా సాధికారిత పరిడ విల్లుతుందని లింగాల పేర్కొన్నారు మహిళా బిల్లుతో అంబేద్కర్ కన్న కలలు సౌఫల్యం చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు