3 ఇసుక లారీల పట్టివేత

కంచికచర్ల: కృష్ణ జిల్లా కంచికచర్ల మండలంలోని చౌటికల్‌ వద్ద కృష్ణా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. వీటిని కంచికచర్ల తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించి కేసులు నమోదు చేయనున్నట్లు తహసీల్దార్‌ విక్టర్‌బాబు తెలియజేశారు.