రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే అవకాశముంది

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు గోదావరి నీటిమట్టం 49.7 అడుగులకు తగ్గింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ భద్రాచలం మండలం నుంచి ఇతర గ్రామాలకు రాకపోకలు నిలచిపోయే ఉన్నాయి. గోదావరి 47 అడుగులకు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే అవకాశముంది. ఈ రోజు సాయంత్రానికి నీటిమట్టం 45 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు. రామాలయం పరిసర ప్రాంతాల్లో వరదనీరు అలాగే నిలిచి ఉంది.