7వ రోజు గాంధీ చిత్రాన్ని వీక్షించిన 6765  మంది విద్యార్థులు-జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

 

సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్టు 23  :::జిల్లాలోని 12 సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తున్న గాంధీ చలనచిత్రాన్ని బుధవారం ప్రభుత్వ,  ప్రైవేటు పాఠశాలకు చెందిన 6765 మంది విద్యార్థినీ, విద్యార్థులు వీక్షించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్  తెలిపారు. మహాత్మా గాంధీ చలనచిత్రం  ఉచిత ప్రదర్శనలో  భాగంగా 7వ రోజు(బుధవారం) జిల్లాలో 6,765మంది విద్యార్థులు చలన చిత్రాన్ని తిలకించినట్లు  తెలిపారు. బుధవారం జిల్లాలోనీ (12) సినిమా ధియేటర్లలలో సినిమాను ప్రదర్శించడం జరిగిందన్నారు.సంగారెడ్డి లోని సితార థియేటర్లో (610) మంది విద్యార్థులు, నటరాజ్ థియేటర్లో (555) మంది విద్యార్థులు, రుక్మిణి థియేటర్లో (560) మంది , జహీరాబాద్ లోఎస్ వి సినీ మాక్స్ థియేటర్ లో (300) మంది, శ్రీ మోహన్ టాకీస్ లో (745), మహేశ్వరి థియేటర్ లో ( 750 ) మంది, నారాయణఖేడ్ లోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో (  560  ) మంది,  పటాన్చెరు శివరంజని డీలక్స్ లో(610 ) మంది, ఎస్ వి సినీ స్క్వేర్ థియేటర్లో (710) మంది, సదాశివపేట  మహేశ్వరి థియేటర్ లో(530),జ్యోతిలో (545), గుమ్మడిదల వెంకటేశ్వర థియేటర్ లో( 290 ) మంది విద్యార్థులు గాంధీ చలనచిత్రాన్ని వీక్షించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.