నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలనుకున్నాం: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్: ఈ నెల 11న స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించామని, సమావేశాల అజెండా ఖరారు చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా బీఏసీ సమావేశమైందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన బీఏసీ సమావేశంలో అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారన్నారు. ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చాక టేబుల్ చేసి బీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. నిబంధనల ప్రకారమే సభలో ముందెకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. ముసాయిదా బిల్లును సభముందుంచాలని, తెలంగాణ బిల్లు పెడితే మద్దతిస్తామని గతంలో అనేక పార్టీలు చెప్పాయ, ఇప్పుడు బిల్లు పెడితే వారే వ్యతిరేకించడం సబబు కాదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సభలో సభ్యుల వైఖరిని తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. బిల్లుపై చర్చను ప్రారంభించాలని ఉప సభాపతిని తానే కోరానని,ఉపసభాపతి చర్చను ప్రారంభించాలంటూ ప్రధాన ప్రతిపక్ష నేత చ&ద్రబాబును కోరారని మంత్రి తెలిపారు.