‘తెలంగాణలో అందరికీ న్యాయం జరుగుతుంది’
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అందరికీ న్యాయం జరుగుతుందని టీఆర్‌ఎస్ నేత కేటీఆర్ అన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ గ్రోత్ ఇంజన్‌లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఎవరికీ భయాలుండవని తెలిపారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పాటుపడతామన్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పారు.