ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం : జానారెడ్డి
హైదరాబాద్: ఇటు మున్సిపల్, అటు సార్వత్రక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టకోకూడదని నిర్ణయించినట్లు టీ కాంగ్రెస్ నేత జానారెడ్డి వెల్లడించారు. జానారెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలనే విషయాన్ని హైకమాండ్‌కు తెలియజేస్తామని చెప్పారు. చివరగా పొత్తుల విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని తెలిపారు. ప్రజల మనోభావాలను గుర్తించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు కృతజ్ఞత చూపించాలని అన్నారు.