ఎన్‌కౌంటర్లతో బాబు పాలన ఆరంభం
ఆంధ్రలో ఎదురుకాల్పులు
ముగ్గురు మావోయిస్టుల మృతి
హైదరాబాద్/ఒంగోలు, జూన్ 19 (జనంసాక్షి) :
అవశేష ఆంధ్రప్రదేశ్ పరిపాలన రక్తచరిత్రతోనే
ప్రారంభమ య్యింది. కొంత కాలంగా సబ్దుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కొలువుదీరుతూనే ఎన్‌కౌంటర్ ద్వారా తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. గురువారం గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో ప్రకాశం జిల్లా పుల్లల చెరువు సమీపంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు, మరో మావోయిస్టు తప్పించుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్, కార్బన్, 303 తుపాకులు దొరికినట్లు సమాచారం. ఎదురుకాల్పుల ఘటనను రెండు జిల్లాల ఎస్పీలు ధ్రువీకరించారు. మృతుల్లో విమలక్క, జానా బాబురావు, సారథి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.