కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ కార్మికుల సమ్మె
హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలంటూ జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో చెత్త నిండిపోయి దుర్వాసన వస్తోంది. సమ్మెలో పారిశుద్ధ్య విభాగంలోని కార్మికులతో పాటు రవాణ, ఎంటమాలజీ, బయోడైవర్సిటీ, వెటర్నరీ సహా మొత్తం 13 కేటగిరీల్లోని కార్మికులు పాల్గొంటున్నారు. 27శాతం ఇంక్రిమెంట్‌ను ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు ఇతరత్రా డిమాండ్లను పరిష్కరించాలంటూ వారు సమ్మెకు దిగారు. దాదాపు 8వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెల్లో పాల్గొంటున్నారు. విధులు బహిష్కరించిన కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ హెచ్చరించినా పట్టించుకోకుండా కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు.