టీఎన్‌ఎస్‌ఎఫ్ నూతన కమిటీ ప్రకటన
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగమైన టీఎన్‌ఎస్‌ఎఫ్ నూతన కమిటీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించారు. రెండు రాష్గాలకు విడివిడిగా అధ్యక్షులను నియమించడంతో పాటు రెండు రాష్గాల విద్యార్థులన సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీని ఆయన ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడిగా గుంటూరు జిల్లా గురజాలకు చెందిన ఎస్.బ్రహ్మం ాదరి నియమితులు కాగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన సి.హెచ్ మధుసూధనాచారి నియామకమయ్యారు. కేంద్ర సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆంజనేయ్ణొడ్ కొనసాగనుండగా సభ్యులుగా విశాఖకు చెందిన ఎ.రాజేష్, చిత్తూరుకు చెందిన ఎ.రవినాయుడు, పశ్చిమగోదావరికి చెందిన శ్యాంసుందరశేష్ళ, వరంగల్‌కు చెందిన సురేష్‌నాయక్, మెదక్ జిల్లాకు చెందిన రమేష్ ముదిరాజుల నియమితులయ్యారు.