భూపాలపల్లిలో దారుణం..

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):

  – ఉపాధ్యాయుల మధ్య వార్..
– హాస్టల్ స్టూడెంట్స్ పై విష ప్రయోగం..
– ఆసుపత్రి పాలైన 11 మంది స్టూడెంట్స్..
– స్టూడెంట్స్ పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది.. ఉపాధ్యాయుల మధ్య జరుగుతున్న వార్ హాస్టల్ పిల్లల ప్రాణాల మీదికి తీసుకొచ్చింది.. ఓ ఉపాధ్యాయుడు పురుగుల మందు త్రాగినీటి ట్యాంకులో కలపడంతో ఆ నీటిని త్రాగిన విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన అత్యంత దారుణమైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. భూపాలపల్లి అర్బన్ బాలుర హాస్టల్ లో జరిగిన ఈ సంఘటన తెలుసుకొని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే లు శనివారం హుటాహుటిన స్థానిక వంద పడకల ఆసుపత్రిని, రెసిడెన్షియల్ హాస్టల్ ను సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు.. పోలీసులు విచారణ చేపట్టారు.. హాస్టల్ లో సైన్స్ ఉపాధ్యాయుడు, స్థానిక ప్రిన్సిపాల్ మధ్య కొద్దిరోజులుగా వార్ నడుస్తుందని, ఇందులో భాగంగా సైన్స్ టీచర్ కుట్ర పన్ని ప్రిన్సిపాల్ ను బదనాం చేసేందుకు త్రాగునీటి ట్యాంకులో పురుగులమందు కలుపగా, ఆ నీటిని త్రాగిన 11మంది స్టూడెంట్స్ శుక్రవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు.. ఈ తతంగం అంతా కొంతమంది స్టూడెంట్స్ గమనించినట్లు హాస్టల్ స్టూడెంట్స్ చెబుతున్నారు..