Sunday, 8 November 2026

కరీంనగర్

రవికుమార్‌ కుటుంబానికి రూ. 6లక్షల చెక్కు

కరీంనగర్‌ : దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లలో మృతిచెందిన కమాన్‌పూర్‌ మండలం బేగంపేటకు చెందిన రవికుమార్‌ కుంటుంబానికి రూ. 6లక్షల చెక్కును మంత్రి శ్రీధర్‌బాబు అందజేశారు. రవికుమార్‌ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

సీఎం దిష్టి బొమ్మ దహనం

కమలాపూర్‌: తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కమలాపూర్‌లో తెరాస ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండలాధ్యక్షుడు మల్లేష్‌, సంపదరావు తదితరులు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

కమలాపూర్‌: కమలాపూర్‌ మండలం కన్నూర్‌లో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని జి.డి శంకర్‌కు చెందిన నివాస గృహం దగ్ధమైంది. ప్రమాద సమయంలో శంకర్‌తల్లి తల్లి , ఏడునెలల చిన్నారి ఇంట్లో ఉన్నారు. అతని భార్య ప్రమాదాన్ని గమనించి వారిని బయటకు తీసుకురావడంతో…

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

పెద్దపల్లి గ్రామీణం: పెద్దపల్లి మండలం పెద్దబొంకూరులో రూ. 32 లక్షలతో చేపట్టనున్న మెటల్‌ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే రమణారావు ప్రారంభించారు. గ్రామంలో రూ.7.25 లక్షలతో నిర్మిస్తున్న రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు.

మెట్‌ పల్లిలో జాబ్‌మేళా

మెట్‌పల్లి గ్రామీణం: మెట్‌పల్లి మండల పరిషత్తు సమావేశ మందిరంలో శనివారం డీఆర్‌డీఏ, రాజీవ్‌ యువకిరణాలు ఆధ్వర్యంలో జాబ్‌ మేళా నిర్వహించారు. మెట్‌పల్లి , మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన 60 మంది నిరుద్యోగ యువతీయువకులు పలు కోర్సుల్లో శిక్షణకు,…

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

మెట్‌పల్లి గ్రామీణం: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తహశీల్దార్‌ భూపతి రెడ్డి, ఎంపీడీవో లక్షీనారాయణ అన్నారు. మెట్‌పల్లి మండలం వేం పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో మెట్‌పల్లి పాత తాలూకా స్థాయి బాలికల…

షేర్‌ అలీ నగర్‌ను సందర్శించిన డీఎంహెచ్‌వో, ఆర్డీవో

కోహెడ: కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి పంచాయితీ పరిధిలోని షేర్‌ అలీనగర్‌లో విషజ్వరాల బారినపడి వారంరోజుల్లో జాస్వీ (5), సమీరా (8) మృత్యువాత పడ్డారు. మరో 8మంది చిన్నారులు అస్వస్థతకు గరయ్యారు. దీంతో శనివారం కరీంనగర్‌ డీఎం హెచ్‌వో నాగేశ్వరరావు,…

అధిక ధరకు గ్యాస్‌ సిలెండర్ల విక్రయం

కోరుట్ల: కోరుట్ల మండలం మాదాపూర్‌ గ్రామంలో గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేయాల్సిన ధర కంటే అధిక ధరకు విక్రయిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. రూ. 420కి రాయితీ సిలిండర్లను సరఫరా చేయాల్సిన వుండగా రూ. 440కి పంపిణీ చేస్తున్న సిలిండర్ల…

రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్వేయం

మెట్‌పల్లి పట్టణం: రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పాటుపడుతుందని మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ గోపిడి బూమరెడ్డి అన్నారు. మార్కెట్‌ యార్డులో ప్రభుత్వం ఇచ్చిన రూ. కోటి నిథులతో ధర్మపురి నర్మింహస్వామి, ఆలయ ఛైర్మన్‌ జువ్వాడి కృష్ణారావుతో…

వ్యాట్‌కు నిరసనగా వ్యాపారుల రాస్తారోకో

మెట్‌పల్లి పట్టణం: వస్త్రాలపై ప్రభుత్వం విధించిన వ్యాట్‌కు నిరసనగా వ్యాపారులు మెట్‌పల్లిలో ఆందోళన బాట పట్టారు. పట్టణంలోని పాత బస్టాండు వద్ద 63వ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వ్యాపారులపై ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా…