డా,,పద్మను వెంటనే ఆరెస్టు చేయాలి
చేర్యాల:స్తానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టరు పద్మను వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం స్తానికంగా జరిగిన సమావేశానికి శీంగారపు బాబు అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడుతు ప్రభుత్వ దవాకానకు రావాలంటేనే బడుగు బలహీన వర్గాల ప్రజలు బయపడుతున్నారని డాక్టర్ పద్మ విపరీత పోకడలే ఆందుకు కారణమని ఆరోపించారు. ఆమె దళిత వర్గాల రోగుల్ని చూడగానే దుర్వాసన వస్తుందని ఆవమాన పరుస్తు చికిత్స చేయకుండా పంపి వేస్తూన్నారని అన్నారు. గతంలో చిట్యాలకు చెందిన తాపి మేస్త్రీ కొండ మహేందర్ ప్రమాదవ శాత్తు గాయపడి చికిత్స నిమిత్తం వెలితే దళితుడనే హెవగింపుతో ప్రమాదితున్ని ముట్టకుండా వేరే హాస్పిటల్‌కు రెపర్ చేయకుండా అవమాన పరచడమే ఆమె నైజానికి అద్దం పడుతుందన్నారు. బాదితుని తండ్రి ఎందుకు చికిత్స చేయవని ఆడుగగా మీ కులము వారు మురికిగా ఉంటారని అవమాన పరచారాని ఆయన విచారం వ్యక్తం చేశారు. కనుక ఆమెను ఎస్సీ ఎస్టీ ఆట్రాసిటి కేసు కింద ఆరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆయిల పాక వెంకన్న ,మంద మల్లేషం ,దుడ్డెల రాంముర్తి,టి జాన్‌పాల్,పెంచిక వెంకట్‌రాములు, కందికట్ల వీరేష్, చుంచు విజెందర్,కర్రె రాములు ,తాడూరి మల్లేషం, యం చందులు తదితరులు పాల్గొన్నారు.