Main

కొమురవెల్లి మల్లన్నకు పెరిగిన ఆదాయం

సిద్దిపేట,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ ఆదివారం సందర్భంగా రూ. 36,87,546 ఆదాయం వచ్చినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి తెలిపారు. శని, ఆదివారాలలో పట్నాలు, విశిష్ట దర్శనం, శీఘ్రదర్శనం, గదుల కిరాయిలు, పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం, వీవీఐపీల దర్శనాల ద్వారా … వివరాలు

రెండు కార్లను దగ్ధం చేసిన దుండగులు

మెదక్‌,  ( జనం సాక్షి):   జిల్లాలోని తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధి పోతరాజ్‌ పల్లిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెండు కార్లను పెట్రోల్‌ పోసి దహనం చేశారు. అడ్వకేట్‌ మూత్తిగళ్ల అశోక్‌, అతని తమ్ముడు ముత్తిగళ్ళ విజయేందర్‌ కార్లను అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో దుండగులు దగ్ధం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు … వివరాలు

జాతీయ లోక్ అదాలత్ అంటే శాశ్వత పరిష్కారం : ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి.

సంగారెడ్డి జిల్లా  జనం సాక్షి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం మార్చ్ 12వ తేదీన మెగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ అంటే శాశ్వత పరిష్కారం స్వత్వర న్యాయం జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ … వివరాలు

కరివిరాల మోడల్ స్కూల్ సమస్యలు మంత్రుల ద్రుష్టికి తీసుకెళ్తాను

– కోదాడ నియోజకవర్గ టీఆరెఎస్ నాయకులు జలగం సుధీర్ మునగాల, ఫిబ్రవరి 10(జనంసాక్షి): నడిగూడెం మండలంలోని కరివిరాల గ్రామ మోడల్ స్కూల్ లో ఉన్న సమస్యలను త్వరలోనే మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించినట్లు కోదాడ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జలగం సుధీర్ శుక్రవారం మోడల్ స్కూల్ ను సందర్శించిన అనంతరం ఆయన … వివరాలు

తెలంగాణ ఎదుగుదలను ఓర్వని ప్రధాని మోడీ

విభజనను రాజకీయంచేయడం దారుణం ఏడేళ్లుగా ఏ ఒక్క హావిూని నెరవేర్చని ప్రధాని బిజెపి తీరును ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపు పార్లమెంటులో ప్రధాని వ్యాఖ్యలపై హరీష్‌ మండిపాటు 2004లో ఎందుకు తెలంగాణ ఇవ్వలేదని ప్రశ్న సిద్దిపేట జిల్లాలో పలుకార్యక్రమాలకు శ్రీకారం సిద్దిపేట,ఫిబ్రవరి8( జనంసాక్షి): తెలంగాణ ఎదుగుతుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావు … వివరాలు

ఊపందుకున్న రియల్‌ బూమ్‌

ఎకరా కోటి అంటున్న రైతులు భూములకు ధరలతో రైతుల్లో ఆనందం మెదక్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి): తెలంగాణ ఏర్పడ్డ తరవాత హైదరాబాద్‌కు చేరువగా ఉన్న పలు ప్రాంతాల్లో రియల్‌ బూమ్‌ ఊపందుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా వెంచర్లు వెలుస్తున్నాయి. రాష్ట్ర రాజధానికి కేవలం 40 కిలోవిూటర్ల దూరంలో ఉండడంతో మెదక్‌ జిల్లా పరిసర ప్రాంత భూములకు డిమాండ్‌ పెరిగింది. ప్రధాన … వివరాలు

బిజెపి నేతల గల్లా పట్టి నిలదీయండి

వడ్లు ఎందుకు కొనరో అడగండి బిజెపి పోతనే రైతులకు మేలు గజ్వెల్‌ ఆందోళనలో మంత్రి హరీష్‌రావు పిలుపు సిద్దిపేట,డిసెంబర్‌20(జనం సాక్షి ): రైతు బాగుపడాలంటే బీజేపీ గద్దె దిగాల్సిందేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మోదీ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని కేంద్రం తీరుపై మంత్రి నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్‌ పిలుపు … వివరాలు

సిఎం సహాయనిధి పేదలకు వరం

క్రిస్మస్‌ వేడుకల్లో దుస్తుల పంపిణీ గజ్వెల్‌లో క్రిస్టియన్‌ భవన్‌ ప్రారంభించిన మంత్రి సిద్దిపేట,డిసెంబర్‌20(ఆర్‌ఎన్‌ఎ): ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్‌ క్రిస్టియన్‌ భవన్‌ ఆవరణలో గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని లబ్దిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన … వివరాలు

కెసిఆర్‌ పాలనపై ప్రజలకు భరోసా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోమారు సత్తా సిద్దిపేట,డిసెంబర్‌12  (జనం సాక్షి)  :   సిఎం కెసిఆర్‌ పాలనపై ప్రజల్లో మరింత భరోసా పెరిగిందని అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చారని అన్నారు. మిగిలిన ఆరు స్థానాలు ఘన విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, … వివరాలు

ట్యాంక్‌బండ్‌పై మల్లినాథసూరి విగ్రహం ఏమైంది?

ఆనాడు హావిూ ఇచ్చినా పట్టించుకోని నేతలు మెదక్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : మెదక్‌ జిల్లాలో జన్మించిన మల్లినాథసూరి గ్రంథధాలు పదిలపర్చగంతో పాటు ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని ఆనాటి ఉప సభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి తెలుగు మహాసభల సందర్బంగా ఇచ్చిన హావిూ అలాగే ఉండిపోయింది. ఇప్పుడా విషయం కూడా అంతా మర్చి పోయారు.  … వివరాలు