కాంగ్రెసొచ్చింది: క్యూలైన్లు తెచ్చింది

 

 

 

 

ఆగష్టు 22(జనం సాక్షి)సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు చూశాం.. తెల్లవారుజాము నుంచే బారులు తీరేవారు. లైన్లలో గంటల తరబడి నిలబడలేక చెప్పులను క్యూలైన్‌లో పెట్టేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ వచ్చింది. మళ్లీ క్యూలైన్లను తెచ్చింది’ అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ హయంలో పదేండ్లు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎరువుల కొరత అనేది కనిపించలేదని, క్యూలైన్లు లేవని గుర్తుచేశారు. సోయిలేని సీఎం, కొందరు మంత్రుల కమీషన్ల దందా యూరియా కొరతకు కారణమని ఆరోపించారు.