మేయర్‌ జుట్టు కత్తిరించిన ఆందోళనకారులు

share on facebook

సూక్రె(బొలీఇయా),నవంబర్‌8 (జనంసాక్షి) : దక్షిణ అమెరికా దేశమైన బొలీవియలో అల్లర్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అధికార మూమెంట్‌ ఫర్‌ సోషలిజం పార్టీ రిగ్గింగ్‌ కు పాల్పడి విజయం సాధించిందన్న ఆరోపణలతో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీంతో దేశంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఈ ఘర్షణలో 20 ఏళ్ల విద్యార్థి చనిపోయాడు. ఈ విద్యార్థి మృతికి కొచాబాంబ పట్టణ మేయర్‌ పేట్రిసియా ఆర్సే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మేయర్‌ కార్యాలయం నుంచి ఆమెను నడిరోడ్డు విూదకు లాక్కొచ్చి జుట్టు కత్తిరించారు. మేయర్‌ పై ఎరుపు రంగు చల్లి, ఆమె జుట్టును కత్తిరించారు. ఆందోళనకారుల నంచి మేయర్‌ ను రక్షించిన పోలీసులు, అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. తనపై జరిగిన దాడిని మేయర్‌ తీవ్రంగా ఖండించారు. ఆందోళనకారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె విూడియా ఎదుట కంటతడి పెట్టారు.

Other News

Comments are closed.