ఆదిలాబాద్

ఒమైక్రాన్‌ భయాలు.. థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు

వందశాతం వ్యాక్సినేషన్‌ కోసం కృషి ఆదిలాబాద్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : ఒమైక్రాన్‌ భయాలు..థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం ఆహార్నిశలు కృషి చేస్తుందని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలన్న లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకోవాలని ఇంటింటికి వెళ్లి సూచించారు.  కరోనాతో పాటు కొత్త … వివరాలు

ధూపదీపంతో ఆలయాలకు శోభవెల్లడిరచిన మంత్రి ఇంద్రకరణ్‌ 

నిర్మల్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : ఇప్పటి వరకూ ఎంతో ప్రాశస్త్యం ఉండి అనేక పురాతన ఆలయాలు ధూప దీప నైవేద్యాలు లేక ఆదరణ కోల్పోయాయి. ఇందుకు భక్తులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి ఆలయాల కోసం ప్రవేశపెట్టిన ధూపదీప నైవేద్యం (డీడీఎన్‌) పథకం అటు అర్చకులతోపాటు ఇటు భక్తులకూ … వివరాలు

మంచిర్యాలలో పోలింగ్‌ పరిశీలించిన శశాంక్‌ గోయల్‌ 

మంచిర్యాల,డిసెంబర్‌ 10 జనంసాక్షి:   ఉమ్మడి ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు … వివరాలు

గిరిజన ప్రాంతాల్లో రాత్రిపూటా వ్యాక్సినేషన్‌

నెలాఖరుకల్లా ప్రక్రియపూర్తి కావాలన్న కలెక్టర్‌ ఆదిలాబాద్‌,డిసెంబర్‌9(జనంసాక్షి ): జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో రాత్రిపూట కూడా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ నెలాఖరు నాటికి వంద శాతం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. అధికారులు, తదితరులతో వ్యాక్సినేషన్‌పై సవిూక్షా సమావేశంలో ఈ సూచనలు చేశారు. ఇదిలావుంటే జిల్లావ్యాప్తంగా రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు … వివరాలు

ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

ఏర్పాట్లు పూర్తి చేశామన్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదిలాబాద్‌,డిసెంబర్‌9(జనంసాక్షి ): ఉమ్మడి జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌, కౌంటింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశామని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ చెప్పారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల నిర్వహణ చేపట్టామన్నారు. పోలింగ్‌, కౌంటింగ్‌ వీడియోగ్రఫి, వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. మొబైల్‌ఫోన్లు, … వివరాలు

సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్‌ పాలన

ఆదిలాబాద్‌,డిసెంబర్‌8 జనం సాక్షి :  కేసీఆర్‌ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. గిరిజన గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని గ్రామస్తులకు సూచించారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు సాగునీరు అందిస్తామని, రైతులకు ఎకరానికి రూ.నాలుగు వేల చొప్పున రెండు పంటలకు వారి ఖాతాల్లో జమ చేస్తామని … వివరాలు

పంచాయితీల్లో డంపింగ్‌ యార్డులు తప్పనిసరి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌7 (జనంసాక్షి) :  గ్రామాల్లో ఉన్న డంపింగ్‌ యార్డుల్లోకి చెత్తను తరలించేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహావిూ సిబ్బందితో కార్యక్రమాల అమలును  సవిూక్షించారు.ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు ఉండేలా చూడాలని, ఉన్న వాటిలోనే చెత్తను వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. గ్రామాల్లో స్థలం లేనిచోట … వివరాలు

ఆసిఫాబాద్‌ ఎస్‌బిఐలో భారీచోరీ

కుమ్రంభీం అసిఫాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి )  : అసిఫాబాద్‌ మండలంలోని అడా ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బ్యాంక్‌ కిటికీలు పగులగొట్టి గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సంఘటన స్థలాన్ని అడ్మిన్‌ ఎస్పీ సుధీంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బ్యాంకులో దొంగలు కట్టర్ల సహాయంతో లాకర్లను తొలగించినట్లు తెలిపారు. … వివరాలు

జంగిల్‌ బడావో..జంగిల్‌ బచావో

కవ్వాల్‌ రక్షణతో పులులకు భరోసా కఠిన చర్యలతో అడవుల్లో రక్షణ ఏర్పాట్లు నిర్మల్‌,డిసెంబర్‌6  ( జనంసాక్షి ) :  అక్కడక్కడా ఇప్పుడు పులులను హతమారుస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.చిరుతలు, పులుల సంఖ్య పెరుగుతోందన్న ఆనందం కన్నా అప్పుడప్పుడూ వాటిని హతమారుస్తున్న దుండగుల వ్యవహారం చూస్తుంటే వారు అడవిని కబళించే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడక ముందు … వివరాలు

వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపని ప్రజలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌3  (జనంసాక్షి)  : జిల్లా వ్యాప్తంగా దాదాపు 200లకు పైగా కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 18 ఏండ్లు నిండి వ్యాక్సిన్‌కు అర్హులైన వారు 5,36,109 మంది ఉన్నారు. ఇందులో మొదటి డోసు వ్యాక్సిన్‌ ఇప్పటి వరకు 5,10,288 మంది తీసుకున్నారు. ఇప్పటికి మొదటి డోసు వేయించుకోని వారు 25,821 మంది … వివరాలు