నల్లగొండ

లారీ, ఆటో ఢీ.. ఇద్దరు మృతి

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  చేవెళ్ల మండలం ముడిమాలగేట్‌ దగ్గర లారీ,ఆటో ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

నల్గొండ: చేనేత కార్మికుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. అప్పుల ఊబిలో చిక్కుకున్న చేనేత కార్మికులు.. దాని నుంచి బయటకు వచ్చే మార్గం కనపడక బలవన్మరణానికి పాల్పడుతూనే ఉన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన చేనేత కార్మికుడు ఆనబత్తుల రవి (40) అప్పుల బాధతో ఆత్మహత్య … వివరాలు

ఖమ్మం, నల్లగొండల్లో 44 డిగ్రీలు

హైదరాబాద్‌: ఇరు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం ఖమ్మం, నల్లగొండల్లో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం కూడా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని … వివరాలు

మద్యం మత్తులో భార్య ను హ‌తమార్చిన భ‌ర్త‌

ఆనాధ‌లైన చిన్నారులు నల్గొండ : మద్యం మత్తులో రోకలితో మోది భార్య హతమార్చాడో కసాయి.. ఈ సంఘటన దేవరకొండ పట్టణంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబ సభ్యుల, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పట్టణంలోని సంజయ కాలనీకి చెందిన నీల నిరంజన, సుగునమ్మల కుమార్తె మంగమ్మ(30)ను గుంటూరు జిల్లా గుర జాల మండలం గొట్టిముక్కల … వివరాలు

సాగర్ ఎడమకాల్వకు నీరు విడుదల

నల్గొండ: నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు నీరు విడుదలైంది. గురువారం ఉదయం మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. మొదటి జోన్ పరిధిలోని ఆరు తడి పంటలకే నీటిని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ రోజుకు 8 వేల క్యూసెక్కులు విడుదల చేయనున్నామని, ఎఎమ్మాఆర్ ప్రాజెక్టు పరిధిలోని చెరువులు నింపుతామని తెలిపారు.

సాగర్కు కొనసాగుతున్న వరద

నల్గొండ : నాగార్జునసాగర్కు వరద ఉధృతి కొనసాగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా,  ప్రస్తుత నీటిమట్టం 514.50 అడుగులకు చేరినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇన్ఫ్లో 22,330 క్యూసెక్కులు కాగా… ఔట్ఫ్లోలో 22,330 నీరు ఉందని వారు వెల్లడించారు. అలాగే శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుత నీటిమట్టం 873 అడుగులు … వివరాలు

విషాదం పాముకాటుతో బాలుడి మృతి

రాజాపేట(నల్గొండ జిల్లా): రాజాపేట మండలం సోమారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నందకిషోర్(8) అనే బాలుడిని సోమవారం తెల్లవారుజామున పాము కాటేసింది. హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా..వైద్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించమని సూచించారు. చికిత్సపొందుతూ కాసేపటికే బాలుడు మృతిచెందాడు.

మొబైల్ షాప్‌లోఆకస్మాత్తుగా అగ్నిప్రమాదం

నల్లగొండ : నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని మొబైల్ షాపులో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక పూలసెంటర్‌లోని ఓ మొబైల్ షాపులో ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి.  ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పైరింజన్లలో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను … వివరాలు

బ్రిడ్జి కింద మృతదేహం

నల్లగొండ: నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల బ్రిడ్జి కింద గుర్తుతెలియని మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతదేహానికి తల చేతులు, కాళ్లు నరికి వేశారు. ఎవరో దారుణంగా హత్య చేసి బ్రిడ్జి కింద పడేసి ఉంటారని పోలీసులు … వివరాలు

పుష్కర ఘాట్ వద్ద కరెంట్ షాక్తో భక్తుడు మృతి

నల్గొండ జిల్లా పానగల్ పుష్కర ఘాట్ వద్ద ఓ భక్తులు కరెంట్ షాక్ తో మరణించాడు. శనివారం పుష్కర స్నానం చేసేందుకు ఘాట్ వద్దకు వెళుతుండగా అతడికి  విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో భక్తుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ  విషయాన్ని గమనించిన పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుడి వివరాలు మత్రం … వివరాలు