నిజామాబాద్

మున్సిపల్‌ ఎన్నికలకు ముందస్తు వ్యూహాలు

రంగంలోకి దిగిన మాజీ ఎంపి కవిత పురపాలికల్లో పాగా వేసేలా చర్చలు నిజామాబాద్‌,నవంబర్‌9 (జనం సాక్షి):  మున్సిపల్‌ ఎన్నికలకు అతి త్వరలోనే నోటిఫికేషన్‌ రానుండడంతో అధికార పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. మాజీ ఎంపీ కవిత ఆధ్వర్యంలో పలు దఫాలు చర్చలు జరిపారు. మున్సిపల్‌ ఎన్నికలపై అధికార పార్టీ నేతలు గత కొన్ని రోజులుగా మాజీ ఎంపీ, … వివరాలు

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు

గుంతల రోడ్లతో ప్రయాణికుల అవస్థలు పట్టించుకోని ఆర్‌ అండ్‌ బి అధికారులు కామారెడ్డి,నవంబర్‌8 (జనం సాక్షి) :  ఇటీవల కురిసిన వర్షాలు, వీటి పై నుంచి భారీ లోడ్‌తో వెలుతున్న వాహనాల కారణంగా బీ హైదరాబాద్‌- మెదక్‌- ఎల్లారెడ్డి- బాన్సువాడ బోధన్‌ రాష్ట్ర ప్రధాన రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. చాలా చోట్ల మోకాలు లోతు … వివరాలు

అకాల వర్షాలతో భారీగా పంట నష్టం 

అయినా బీమా సొమ్ముపై అపనమ్మకం నిబంధనల ఉచ్చులో రైతుకు అందని సాయం నిజామాబాద్‌,నవంబర్‌8 (జనం సాక్షి) :  జిల్లాలో ఈ ఖరీఫ్‌లో గత ఇరవై రోజులుగా కురిసిని వర్షాల కారణంగా పలు గ్రామాల్లో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 33 శాతానికంటే ఎక్కువ మొత్తంలో పంటలు దెబ్బతింటేనే నష్టపరి హారానికి సిఫార్సు చేసి … వివరాలు

కుల వివక్షకు దూరంగా ఉండాలి

కామారెడ్డి,నవంబర్‌4 (జనంసాక్షి) : చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, దళితులపై కుల వివక్ష చూపరాదని తాడ్వాయి తహసీల్దార్‌ శ్రీనివాసరావు అన్నారు. సమాజంలో మానవులంతా ఒక్కటే అన్నారు. గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి పాటించవద్దని  తెలిపారు. ఎస్సీ,ఎస్టీ, మానవ హక్కులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.  కుల మత ద్వేషాలు పెట్టుకోవద్దని, శాంతియుత వాతావరణంలో జీవించాలన్నారు. ఎలాంటి … వివరాలు

బోధనారుసుముల చెల్లింపులో ఆలస్యం

సకాలంలో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు నిజామాబాద్‌,అక్టోబర్‌4 (జనంసాక్షి):   ఉన్నత విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు సకాలంలొ అందకపోవడంతో వారు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు.  ప్రభుత్వం బోధనా రుసుంలను  చెల్లిస్తుండటంతో అనేకులు ప్రైవేటు సంస్థల్లో వృత్తి విద్య కోర్సుల్లో చేరేందుకు ముందుకొస్తున్నారు. అయితే… నిధుల మంజూరులో జాప్యం కారణంగా విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. … వివరాలు

సమస్యలు పరిష్కరించకుండా నిందాలా?: డిసిసి

నిజామాబాద్‌,అక్టోబర్‌ 4 (జనంసాక్షి): రైతులకు రుణమాఫీ చేయని కేసీఆర్‌ మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయల పథకాలకు కోట్లు ఎలా కుమ్మరిస్తున్నారని డిసిసి చీఫ్‌ తాహిర్‌ బిన్‌  అన్నారు.  తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెడితే  చేసిందేమిటని అన్నారు. పాలించే దమ్ములేక  సమాధానం చెప్పుకోలేక పోతున్నారని మండిపడ్డారు. మిషన్‌ కాకతీయ అవినీతికి అడ్డాగా మారిందన్నారు.  రైతులకు రుణాలు ఇవ్వలేని … వివరాలు

నిజాంసాగర్‌ ఆయకట్టు రైతులకు భరోసా

నిజామాబాద్‌,అక్టోబర్‌ 4(జనంసాక్షి):  నిజాంసాగర్‌ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. శ్రీరాంసాగర్‌ నుంచి నీరు విడుదలతో పంటలకు ఢోకా లేదని అన్నదాతలు అంటున్నారు. సాగర్‌  నిండితే నిజామాబాద్‌ వ్యవసాయరంగానికి కళ ఎండితే వెలవెల అన్న నానుడి ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. మంజీర పరివాహక ప్రాంతం జిల్లాలో మొదలయ్యే నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు మొదలు నిజాంసాగర్‌ జలాశయం … వివరాలు

సీపీఎస్‌ పింఛను విధానం రద్దు చేయాలి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌30  (జనంసాక్షి):   సీపీఎస్‌ పింఛను విధానంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఉపాధ్యా సంఘాల నేతలు పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాలిట గుదిబండగా మారిన సీపీఎస్‌ పింఛను విధానాన్ని రద్దు చేసేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. పాత పింఛను విధానాన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన ఒత్తిడి తీసుకొచ్చి సమస్య పరిష్కారానికి కృషి … వివరాలు

కిరాణ వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడొద్దు, వాడితే జరిమాన, కేసులు

– మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ భీమ్‌గల్‌, సెప్టెంబర్ 26 (జనంసాక్షి) : భీమ్‌గల్‌ పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశంను మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ నుండి … వివరాలు

ఘనంగా మాజీ ప్రభుత్వ విప్ అనిల్ జన్మదిన వేడుకలు

భీమ్‌గల్‌, సెప్టెంబర్ 26 (జనంసాక్షి) : భీమ్‌గల్‌ మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో గురువారం మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి స్వీట్లు పంచి ఘనంగా జరుపుకున్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. … వివరాలు