నిజామాబాద్

12న ఉద్యోగ మేళా

కామారెడ్డి,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 12న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి షబనా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాబ్‌మేళా కొనసాగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌, కామారెడ్డి ప్రాంతంలోని ప్రముఖ కంపెనీలైన హెచ్‌ఎంఎస్‌ … వివరాలు

సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయాలు

నిజామాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): మార్కెట్లో పత్తి క్రయ విక్రయాలను పరిశీలించి, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని రైతులను అధికారులు అడిగి తెలుసుకున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు అన్ని జిల్లాల్లో ఉన్నాయని, ఇతర జిల్లాల పత్తిని కొనుగోలు చేయవద్దని నిజామాబాద్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల సీసీఐ కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జి జేడీ ఇఫ్తార్‌ఖాన్‌ అన్నారు. మార్కెట్లోకి పత్తి ఎక్కడెక్కడి నుంచి … వివరాలు

కస్తూర్బా పాఠశాలలో స్పీకర్‌ ఆకస్మిక తనిఖీ

సమస్యలు అడిగి తెలుసుకున్న పోచారం కామారెడ్డి,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలోని బాన్సువాడ మండలంలోని కొత్తాబాది కస్తూర్భా పాఠశాలలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. పాఠశాల ఆవరణలో కలియదిరుగుతూ పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించిన స్పీకర్‌.. పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు వస్తున్నారా.. అని విద్యార్థులను అడిగారు. ఉపాధ్యాయులు … వివరాలు

తెరాస వైఫల్యాలను ఎండగడతాం

హావిూలపై నోరుమెదపని నేతలు నిజామాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తెలంగాణ ఏర్పడ్డ తరవాత అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల పాలనలో తెరాస పూర్తిగా వైఫల్యం చెందిందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ హుదాన్‌ విమర్శించారు. ఇచ్చిన హావిూలను తుంగలో తొక్కారని అన్నారు. అవినీతి, అహంకారానికి తెరాస ట్రేడ్‌మార్క్‌గా మారిపోయిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండానే గోబెల్స్‌ ప్రచారంతో ప్రజలను మభ్య … వివరాలు

కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం

– చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు మృతి కామారెడ్డి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : కామారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో కృష్ణ మందీర్‌ సవిూపంలో ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు లావణ్య(35), రోషిణి(14), సుశీల్‌(28), … వివరాలు

నిరుద్యోగులను వంచిస్తున్నారు

నిజామాబాద్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా ఇదేమని ప్రశ్నిస్తే నిర్బంధాలు, అణచివేత విధానాలు కొనసాగిస్తోందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా తప్పయ్యిందని, నిజాం పాలనను తలపించేలా నిర్బంధాలను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని … వివరాలు

విత్తన సాగుపై దృష్టి సారించాలి

రైతులకు అన్నిరకాల ప్రోత్సాహకాలు: మంత్రి నిజామాబాద్‌,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): విత్తన ఉత్పత్తి చేసే రైతులు అధిక లాభాలను ఆర్జించేలా వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందని మంత్రి ప్రశాంత రెడ్డి అన్నారు. రాష్టాన్న్రి విత్తన కేంద్రంగా మార్చు కోవడానికి సీఎం కేసీఆర్‌ పలు చర్యలు తీసుకొంటున్నారని, అందుచేత రైతులు లాభాలు ఆర్జించేందుకు ప్రోత్సాహం అందించాలని విత్తన కంపెనీలకు సూచించారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు … వివరాలు

స్వచ్ఛ పనుల్లో అలసత్వం తగదు: కలెక్టర్‌

కామారెడ్డి,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా స్వచ్చ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పూర్తి చేయాలని, స్పెషల్‌ ఆఫీసర్లు తమకు కేటాయించిన మండలాల్లో ఓడీఎఫ్‌ పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. గ్రామాల్లో తప్పనిసరిగా మరుగుదొ డ్లు నిర్మించుకోవాలని తెలిపారు. స్పెషల్‌ ఆఫీసర్లు గ్రామాల్లో ఉండి పనులు పరిశీలించాలన్నారు. నిధుల సమస్య లేనందున ఆన్‌లైన్‌ … వివరాలు

పసుపుబోర్డుపై కానరాని కదలిక

అటకెక్కిన ఎంపి అర్వింద్‌ హావిూ ధరల కోసం పసుపు రైతుల ఆందోళన నిజామాబాద్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): పసుపు రైతుల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వం పసుపు కొనుగోలు చేస్తేనే రైతులు గట్టేక్కే అవకాశముంది. పసుపు బోర్డుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. శాశ్వత పరిష్కారం కోసం పార్లమెంట్‌ ఎన్నికల్లో 178మంది రైతులు నామినేషన్లు వేశారు. వెంటనే … వివరాలు

సేంద్రియ పద్దతులను అవలంబించండి

అంకాపూర్‌ను ఆదర్శంగా తీసుకోండి కామారెడ్డి,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): రైతులు సాంకేతిక పద్ధతుల్లో, సేంద్రియ విధానంలో సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. దీంతో పెట్టుబడులు తగ్గడమే గాకుండా పంటలకు డిమాండ్‌ కూడా దక్కుతుందన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని అంకాపూర్‌ గ్రామ రైతులు ఉపయోగించే పద్ధతులను పరిశీలించి అవలంభించాలని అన్నారు. పాలీహౌస్‌ ద్వారా పూల సాగు చేస్తున్న … వివరాలు