మహబూబ్ నగర్

ప్రశాంత ఎన్నికలకు పక్కా చర్యలు

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఎస్పీ రెమారాజేశ్వరి మ‌హబూబ్‌నగర్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి):అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌సి రెమారాజేశ్వరి తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో వారు ఎలాంటి గొడవలకు దిగినా కేసు నమోదుతో పాటు కఠిన చర్యలు ఉంటాయన్నారు. అతి సమస్యాత్మక ప్రాంతాల్లో … వివరాలు

అభివృద్ది కోసం టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టండి

మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాజెక్టులు పూర్తి నిరంజన్‌ రెడ్డి పిలుపు వనపర్తి,నవంబర్‌20(జ‌నంసాక్షి): రాష్ట్ర అభివృద్ధిని గుర్తించి ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్‌ను బలపరచాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే కాంగ్రెస్‌, టీడీపీలు జట్టుకట్టి కూటమిగా తయారై ప్రజలను తికమక పెట్టడానికి వస్తున్నాయని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మన జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ … వివరాలు

కొడంగల్‌లో విూ కుట్రల ఆటలు సాగవు

తోడేళ్ల మంద వస్తోంది జాగ్రత్త ప్రజల పక్షాన హైటెన్షన్‌ వైరులా ఉంటా రేపటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కొడంగల్‌ ప్రజలదే కీలక భూమిక నామినేషన్‌ ఉపన్యాసంలో రేంవత్‌ రెడ్డి కొడంగల్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): రాబోయే ప్రభుత్వంలో కొడంగల్‌ నియోజకవర్గ ప్రజలది కీలక భూమిక ఉంటుందని, రాష్ట్ర రాజకీయాలను శాసించే పట్టు కొడంగల్‌ ప్రజలు సాధించబోతున్నారని చెప్పారు. ప్రజలు ఇచ్చిన గుండె … వివరాలు

టిక్కెట్ల పంపిణీలో జైపాల్‌తో డికె కు విభేదాలు

పై చేయి సాధించిన అరుణ మహబూబ్‌నగర్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. డీకే అరుణకు జైపాల్‌ రెడ్డి అడ్డుకట్ట వేసేందుకు గట్టిగా ప్రయత్నించినప్పటికీ అది విఫలమైందనే చెప్పొచ్చు. ఎందుకంటే.. … వివరాలు

మహాకూటమిని ఛీ కొడుతున్నారు

కూటమిలో సీట్ల పంచాయితే తేలడం లేదు ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రచారంలో మంత్రి మహేందర్‌ రెడ్డి వికారాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని మంత్రి మహేందర్‌ రెడ్డి తెలిపారు. కూటమి పేరు చెబితేనే ప్రజలే మండిపడుతున్నారని అన్నారు. తమ నేత కెసిఆర్‌ అభ్యర్థులను ప్రకటించి 70 రోజులైనా వారికి … వివరాలు

రాసిచ్చిన ముక్కలు చదవి మాట్లాడితే ఎలా

ఓటమి భయంతో సినీనటులతో ప్రచారమా? కూటమితో ప్రాజెక్టుకు గండి తప్పదు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్న లక్ష్మన్న మహబూబ్‌నగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): నాలుగు రాసిచ్చిన ముక్కుల పట్టుకుని కాంగ్రెస్‌ నాయకురాలు,నటి ఖుష్బూ మాట్లాడారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా.లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ గురించి ఆమెకు ఏమాత్రం తెలుసన్నారు. ఓటమి భయంతో కాంగ్రెస్‌ నేతలు నటులను ప్రచారానికి … వివరాలు

టీఆర్‌ఎస్‌ లోకి వలసలు

యాదాద్రి భువనగిరి,నవంబర్‌15(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ లోకి వలసలు కొనసాగుతున్నాయి. సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలంలోని వర్లగడ్డ తండా, ఆంబోతు తండాల నుండి వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 వందల మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ లో చేరారు. టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా … వివరాలు

ఉమ్మడి జిల్లాలో 14సీట్లు మావే

కూటమి కుట్రలను ప్రజలు చిత్తు చేస్తారు ప్రచారంలో మంత్రి జూపల్లి మహబూబ్‌నగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు ఓటు వేసి మోసపోవద్దని ఓటర్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. మహాకూటమికి ఓటు వేస్తే తెలంగాణ అభివృద్ధి కుంటు పడుతుందన్నారు. కూటమి ఎత్తులను చిత్తు చేయాలని పిలుపునిచ్చారు. గురువారం పాన్‌గల్‌ మండలంలోని బండపల్లి, బహదూర్‌ గూడెం గ్రామాల్లో మంత్రి … వివరాలు

పోడురైతులకు వేధింపులు సరికాదు

మహబూబాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హావిూలను విస్మరిస్తున్న తెరాస ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని న్యూడెమక్రసీ నేతలు అన్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిచ్చే విషయంలో సర్కారు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ప్రజా సంక్షేమాన్ని వదలేసిన ప్రభుత్వం పదవులు, సంపదపై మక్కువ కనబరుస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం … వివరాలు

ఓట్ల కోసం చరిత్రను వక్రీకరిస్తారా?

బిజెపి మాత్రమే అభివృద్దికి పాటుపడగలదు: ఆచారి మహబూగ్‌నగర్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): నిజాం పరిపాలనను సీఎం కెసిఆర్‌ పొగడటం హిందువుల మనోభావాలను కించపర్చడమేనని బిజెపి రాష్ట్ర కార్యదర్శి, కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారి అన్నారు. కేవలం ఓటుబ్యాంక్‌ రాజకీయాల కోసం చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు. ఇలాంటి పార్టీని ఎత్తుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేదన్నారు. తెరాస గెలుస్తోందని చెప్పిన సర్వేలన్నీ … వివరాలు