మెదక్

తెలంగాణలో ఇక్రిశాట్ ఉండటం గర్వకారణం: కేటీఆర్

సంగారెడ్డి: తెలంగాణలో ఇక్రిశాట్ ఉండటం గర్వకారణమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పటాన్‌చెరు ఇక్రిశాట్‌లో ఇన్నోవేషన్ హబ్‌ను మంత్రులు కేటిఆర్, పోచారం శ్రీనివాసురెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వ్యవసాయంలో టెక్నాలజీ వాడుతున్నామని, సామాన్యుడికి టెక్నాలజీని అందించాలని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కరెంట్‌ కోతలను అధిగమించామని, వ్యవసాయానికి పగలు 9 గంటల కరెంట్ ఇస్తున్నామని … వివరాలు

భార్యను చంపిన భర్తపై దాడి

అందోలు: మెదక్‌జిల్లా అందోలు మండలం రాంసానిపల్లి గ్రామంలో ఓ భర్త భార్యను చంపి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భర్తను చితక బాదారు. పరిస్థితిని నిలువరించడానికి వచ్చిన పోలీసులపై కూడా మృతురాలి బంధువులు దాడి చేయడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. బాధితుల కథనం ప్రకారం.. అనసూయ(32), సుబుద్ధి అలియాస్‌ … వివరాలు

బస్సు ఎక్కుతూ కిందపడి వ్యక్తి మృతి

సదాశివపేట: బస్సు ఎక్కుతూ ప్రమాదశాత్తు బస్సు కింద పడి ఓ ప్రయాణికుడు చనిపోయిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. సదాశివపేటకు చెందిన మల్లేశం తన కుమారుడితో కలిసి హైదరాబాద్‌ వెళ్లేందుకు బస్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఒక్కసారిగా బస్సు ముందుకు కదలడంతో మల్లేశం కిందపడిపోయాడు. డ్రైవర్ తేరుకునేలోపే బస్సు ముందు చక్రాలు అతని మీద … వివరాలు

వంతెనపై నుంచి పడ్డ లారీ.. క్లీనర్ మృతి

సిద్ధిపేట(మెదక్ జిల్లా): మెదక్‌ జిల్లాలోని సిద్ధిపేట మండల శివారులో హరిహర రెసిడెన్సీ వద్ద నున్న వంతెన పై నుంచి గురువారం ఓ ఇటుక లారీ అదుపు తప్పి కిందపడింది. ఈ ఘటనలో క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను హైదరాబాద్ తరలించారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ … వివరాలు

అర్ధరాత్రి వృద్ధ దంపతులు దారుణ హత్య

 మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ మండలం సత్యగామ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అంబయ్య(75), సుశీలమ్మ(70) దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. కుమారుడు సత్తయ్య గ్రామంలోనే కొత్త ఇంటిని నిర్మించుకుని అందులో ఉండగా.. అంబయ్య దంపతులు పాత ఇంట్లోనే ఉంటున్నారు. … వివరాలు

‘హరీష్ కు ఆ అర్హత లేదు’

రాష్ట్రంలో ఉన్నది గాంధీ పాలనా లేక గాడ్సే పాలనా అని జగ్గ్గారెడ్డి విమర్శించారు. అహింసా మార్గంలో చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం అణగదొక్కుతోందని, బాధితులకు న్యాయం చేయాలని చేస్తున్న దీక్షలను భగ్నం చేస్తోందని ఆయన ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘నేను తెలంగాణ ద్రోహిని అయితే.. తలసాని, తుమ్మల, కడియం, మహేందర్‌రెడ్డి ఏమవుతారని’ ప్రశ్నించారు. … వివరాలు

ఆంధోల్‌లో రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

మెదక్: మెదక్ జిల్లా ఆంధోల్ మండలం కిచ్చన్నపల్లి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రూజర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి… క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రిలో ప్రాధమిక చికిత్స … వివరాలు

జీపు చెట్టును ఢీకొని ముగ్గురు మృతి

మెదక్ : ఆందోల్ మండలం దానంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మంది మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది.

తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డ: ప్రధాని మోదీ

మెదక్: తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డని ఇంత తక్కువ కాలంలో అభివృద్ధి దిశగా అడుగులేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రం, తెలంగాణ మధ్య సంబంధాలు బాగున్నాయని, కేసీఆర్‌ నన్నెప్పుడు కలిసినా తెలంగాణ అభివృద్ధినే ప్రస్తావించారని ఆయన చెప్పారు. గజ్వేల్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని … వివరాలు

జానారెడ్డి, షబ్బీర్‌ అలీ అరెస్టు

మెదక్‌ : కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీని పోలీసులు అరెస్టు చేశారు. మల్లన్నసాగర్‌ జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోతున్న కొండపాక, తొగుట మండలాల్లో బాధితులను కలిసి పరామర్శించేందుకు జానారెడ్డి, షబ్బీర్‌అలీ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. వారిని మార్గ మధ్యంలో మెదక్‌ జిల్లా రాజీవ్‌ రహదారిపై ములుగు మండలం ఒంటిమామిడి వద్ద సిద్దిపేట … వివరాలు