ఆ సమస్యలు అధిగమిస్తే అధికారం మాదే : బొత్స

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌, రైతు సమస్యలు మాత్రమే ఉన్నాయని వాటిని అధిగమించగలిగితే 2014 లోవిజయం తమదేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స అన్నారు.  వైకాపా వల్ల కాంగ్రెస్‌కు ఎటువంటి నష్టం లేదని చెప్పారు . ఆరోగ్యశ్రీ సహా సంక్షేమ పథకాలన్నీ వైఎస్‌ పాలనకంటే మెరుగ్గా అమలవుతున్నాయని.. వాటి అమలు సరిగ్గా లేదని నిరూపిస్తే తలదించకుంటానని అన్నారు.