క్షమాపణలు చెప్పిన అభిజిత్ ముఖర్జీ
సోదరుడు వ్యాఖ్యల్ని ఖండించి క్షమాపణ కోరిన శర్మిష్ఠ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, బెంగాల్ ఎంపీ అభిజిత్ ముఖర్జీ క్షమాపణలు చెప్పారు. ఓ వార్తఛానెలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఢిల్లీలో అత్యాచార నేరాలను ఖండిస్తూ చేస్తున్న ప్రదర్శినలపై తన అభిప్రాయం చెప్తూ విద్యార్ధినులకన్నా ఎక్కువగా మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులు తెలియని ‘డెంటెడ్ అండ్ పెయింటెడ్ లేడీస్’ నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దాంతో విమర్శిలు వెల్లువెత్తాయి. ఆయన సోదరి శర్మిష్ఠ సైతం సోదరుడి వ్యాఖ్యల్ని ఖండించి ఆయన తరపున తాను క్షమాపణలు చెప్తున్నానన్నారు. ఆ తర్వాత అభిజిత్ కూడా క్షమాపణలు కోరారు. నిరసనకారుల్లో విద్యార్థులు ఎక్కువ లేరని చెప్పడమే తన ఉద్దేశమని ఎవరినీ నోప్పించడం తన అభిమతం కాదని ఆయన పేర్కొన్నారు.