తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీ

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోరుతూ కార్యకర్తలు, తెలంగాణవాదులు బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ భవన్‌ వద్ద పార్టీ నేత నాయిని నర్సింహారెడ్డి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. పది జిల్లాల నేతలు పట్టణాల్లో ర్యాలీలో పాల్గొన్నారు.