నూతన సంవరత్సర వేడుకలను రద్దుచేసిన సైన్యం
న్యూఢిల్లీ : ఢిల్లీ అత్యాచార బాధితురాలి మృతికి సంతాపంగా సైన్యంలో నూతన సంవత్సర వేడుకలను రద్దుచేశారు. దేశంలొని అన్నీ సైనిక కార్యాలయాలు, కంటోన్మెంట్లలో వేడుకలు రద్దు చేస్తున్నట్టు సైనిక ఉన్నాతాధికారులు ప్రకటించారు. నూతన సంవత్సరం రోజున ప్రధాన సైనికాధికారి విక్రమ్‌సింగ్ ఆయన సతీమణితో కలిసి సైనిక విభాగానికి చెందిన ఆసుపత్రిని సందర్శించనుట్టు సమాచారమందింది.