నేడు తిరుపతిలో ఉద్యోగమేళా
తిరుపతి,మార్చి25 : జిల్లా గ్రావిూణాభివృద్ధి సంస్థ, ప్రభుత్వ ఐటిఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీ గురువారం తిరుపతిలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్రెడ్డి తెలిపారు. తిరుచానూరు మార్గంలోని పద్మావతీపురం ప్రభుత్వ ఐటిఐలో ఉదయం 9 గంటల నుంచి జరిగే మేళాలో శ్రీసిటీలోని క్యాడ్బరీ సంస్థ ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. రెండు సంవత్సరాల ఐటిఐలో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు లేదా 2015లో చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులని చెప్పారు. 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు అర్హులని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు గుర్తింపుకార్డు, రేషన్, ఆధార్ కార్డు, ధ్రువపత్రాల నకలు, బయోడేటాతో హాజరు కావాలని కోరారు. తిరుపతి నగరంలోని అన్నమయ్య సర్కిల్ సవిూపంలోగల తహసీల్దారు కార్యాలయం వెనకనున్న టీటీడీసీలో ఏప్రిల్ 1వ తేదీ ఉద్యోగమేళా జరుగుతుందని పీడీ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి జరిగే మేళాలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు తిరుపతి సంస్థ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఏదైనా డిగ్రీతోపాటు, కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ చేయగలవారు, బీటెక్ పూర్తిచేసిన వారు అర్హులని తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయసున్నవారు అర్హులని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు హాజరుకావాలని కోరారు.