పంచాయతీ కార్మికుల గోస ప్రభుత్వం పట్టించుకోదా

శామీర్ పేట్ , జనంసాక్షి
రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా శామీర్ పేట్ మండల కేంద్రంలోని మండల కార్యాలయం ముందు పంచాయతీ కార్మికులు గేటు ముందు నిలుచొని నిరసన వ్యక్తం చేశారు. సీఐటియు నాయకులు కిష్టప్ప దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా పంచాయతీ కార్మికుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం స్వచ్భ భారత్ లో ముందు ఉందని చెప్పే పాలకులు కార్మికుల గురించి పట్టించుకొనే నాథుడే కరువాయ్యడని ఎద్దేవా చేశారు. కరోనా కాలంలో ప్రతి గ్రామపంచాయతీ కార్మికుడు ప్రాణలకు తెగ్గించి సేవలు చేసిన, కార్మికుల ఆరోగ్యానికి రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు విఫలం అయ్యాయన్నారు. చీపురు పట్టుకొని స్వచ్ భారత్ ఫోటో లు దిగే ప్రభుత్వలాకి కార్మికుల బాధలు కనబడటం లేదా అన్నారు. మరో వైపు సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి కార్మికులను పట్టించు కోవడం లేదని కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబానికి 10లక్షల నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలని, జాతీయ అర్జీత సెలవు దినాలు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కోనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మిక సంఘం నాయకులు సుధాకర్, ముత్యాలు, శ్రీకాంత్,
పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
లు

తాజావార్తలు