రామాలయ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంబించిన జడ్పీ ఛైర్మన్
జుక్కల్, మార్చి 30,( జనంసాక్షి ),
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని నిజాం సాగర్ మండలం మహ్మద్ నగర్ గ్రామంలో 30లక్షల రూపాయలతో నిర్మించిన రామాలయ కమ్యూనిటీ భవనాన్ని గురువారం జడ్పీ ఛైర్మన్ దఫేదార్ శోభరాజు ప్రారంబించారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి,స్ధానిక సర్పంచ్ బాలమణి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, గున్కుల్ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ,వైశ్య సంఘం ప్రతినిధులు కాశీనాథ్ సేట్, శ్రీను సేట్, రాజయ్య సేట్, విట్టల్ సేట్ ,భాస్కర్ సేట్ ,కుమార్ సేట్, రాజుసేట్ తదితరులు పాల్గొన్నారు.