యశోద నుంచి ఏడుగురు విద్యార్థుల డిశ్చార్జి

హైదరాబాద్: మాసాయిపేట ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు యశోదా ఆసుపత్రిలో కోలుకొని ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారు. విద్యార్థులు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు మాట్లాడుతూ… చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. చికిత్స పొందుతున్న మరో ఏడుగురు విద్యార్థులు 2, 3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వైద్యుల పర్యవేక్షణలో మరో నలుగురు విద్యార్థులు చికిత్స పొందుతున్నారని చెప్పారు.