రంగారెడ్డి

రెవెన్యూ సదస్సును ప్రారంభించిన మంత్రి

వికారాబాద్‌: మండలంలోని ఐనాపూర్‌ గ్రామంలో రెవెన్యూ సదస్సులను మంత్రి ప్రసాదకుమార్‌ ప్రారంభించారు. రెవెన్యూ సమస్యలతో పాటు స్థానిక సమస్యలను కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కరించనున్నట్లు చెరప్పారు.

10 ఇసుక లారీల సీజ్‌

రంగారెడ్డి: శంషాబాద్‌ మండలం చింతపల్లి వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడ్‌తో వెళ్తున్న 10 ఇసుక లారీలను సీజ్‌ చేశారు. వాహన యజమానులకు జరిమానా విధించారు.

నగరంలోకి ప్రవేశించిన మునుగోడు ఎమ్మెల్యే పాదయాత్ర

అబ్దుల్లాపూర్‌మెంట్‌: దిండి-నక్కలగండి ఎత్తిపోతల పథకానికి పరిపాలన ఆమోదం ఇవ్వాలని, శ్రీశైల సొరంగ మార్గానికి నిధులు కేటాయించి పూర్తి చేయాలని సీపీఐ నేతృత్వంలో మునుగోడు ఎమ్మెల్యే యాదగిరిరావు చేపట్టిన …

కబేళాకు గోవుల తరలింపును అడ్డుకున్న భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు

కుత్బుల్లాపూర్‌: గోవులను కబేళాకు తరలిస్తున్న వారిని అడ్డుకుని హిందూ వాహిని, భజరంగదశ్‌ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ప్రాంతం నుంచి రెండు డీసీఎం వాహనాల్లో …

టైర్ల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌ మండలం ఎర్రగుంట్ల తండాలోని టైర్ల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక …

ఇంజినీరింగ్‌ కళాశాలకు బాంబు బెదిరింపు

మేడ్చల్‌: రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌కు సమీపంలోని సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో రెండు బాంబు స్వ్యాడ్‌ బృందాలతో మేడ్చల్‌ పోలీసులు కళాశాలలో …

విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

పుప్పాలగూడ: రాజేంద్రనగర్‌ మండలం పుప్పాలగూడ శ్రీనగర్‌ కాలనీలోని శ్రీజ ఏంజెల్స్‌ అపార్ట్‌మెంట్‌ మొదటి అంతస్తులో విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం విద్యుత్తు కోత సమయంలో …

అర్జీలను స్వీకరించిన రాష్ట్రమంత్రి

వికారాబాద్‌ గ్రామీణం: దారూర్‌ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి రాష్ట్ర చేనేత జౌళి శాఖా మంత్రి ప్రసాద్‌కుమార్‌ సోమవారం అరీలను స్వీకరించారు, …

వేతనాలు పెంచాలని ఆందోళన

పుడూరు: గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న రోజువారీ కార్మికులకు వేతనాలు పెంచాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం వుడూరు మండల కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ …

సీడీ, గోడపత్రికను విడుదల చేసిన జిల్లా ఎస్పీ

వికారాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ రాజకుమారి ఉగ్రవాద నిర్మూలన సీడీ, గోడపత్రికలను ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో సామవారం విడుదల చేశారు. ఈ …