తెలంగాణ

గోశాలల పరిరక్షణకు ప్రత్యేక కమిటీ: మంత్రి రామచంద్రయ్య

హైదరాబాద్‌ : గోశాలల పరిరక్షణకు ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు మంత్రి రామచంద్రయ్య తెలిపారు. గోశలల సంరక్షణ తమ బాధ్యత కాదని మానవతా దృక్పథంతోనే వాటిని పర్యవేక్షిస్తున్నామన్నారు. వసతులున్న …

శూన్యంపాడులో విషజ్వరాలతో ఆరుగురి మృతి

నల్గొండ, జనంసాక్షి: నేరేడుచర్ల మండలం శూన్యంపాడులో విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఈ గ్రామంలో విషజ్వరాలతో ఆరుగురు మృతి చెందారు. అయినా వైద్యాధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు.

పదో తరగతి పరీక్షల్లో 88.08 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి పార్థసారథి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 88.08 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. గతేడాదితో పోలీస్తే …

సీబీఐ డైరెక్టర్‌ క్షమాపణలు చెప్పాలి: సురవరం

హైదరాబాద్‌: రైల్వే శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బన్సల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ సీబీఐ డైరెక్టర్‌ మాట్లాడడాన్ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం …

వైకాపా విస్తృతస్థాయి భేటీకి హాజరుకాని కొణతాల

హైదరాబాద్‌: వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నివాసంలో పార్టీ విస్తృతసాయి సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ భేటీకి పార్టీ సీనియర్‌ నేత కొణతాల రామకృష్ణా హాజరుకాలేదు.

దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాప్‌ వద్ద మహిళ హల్‌చల్‌

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాప్‌ వద్ద మతిస్థిమితం లేని ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. చెట్టు ఎక్కి దూకుతానని బెదిరించింది. దీంతో స్థానికులు ఆమెను కిందికి దించేందుకు యత్నిస్తున్నారు.

గురుకుల పాఠశాలల్లో 94.99 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురుకుల పాఠశాలల్లో 94.99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 45.50గా ఉంది.

జూన్‌ 15 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 15 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు జూన్‌1 చివరి తేదీ.

172 ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిఫత్‌ పాఠశాలలో కూడా వంద శాతం ఉత్తీర్ణత నమోదయింది.

బాలికలదే పైచేయి

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతలో బాలికలు పైచేయిగా నిలిచారు. బాలికలు 88.90 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలుర ఉత్తీర్ణత 87.30 శాతంగా ఉంది.