సోనియా, రాహుల్‌కు ఊరట

న్యూఢిల్లీ: నేషనల్‌ హొరాల్డ్‌ అంశంలో సోనియా,రాహుల్‌కు ఢిల్లీకోర్టు ఊరట కల్పించింది.. భాజపా ఎంపి సుబ్రహ్మణ్యస్వామి దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.. నేషనల్‌ హెరాల్డ్‌కురూ.90 కోట్ల రుణంఇవ్వటంపై ఆ సంస్థకు చెందినమర్ని డాక్యుమెంట్లను పరిశీలించాలని కోరుతూ సుబ్రహ్మణ్యసస్వామి పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా కోర్టు దీన్ని కొట్టివేసింది.

రన్‌వేపై జారిన ఎయిర్‌వేస్‌ విమానం

గవా: గోవాలని డొబోలిమ్‌ విమానాశ్రయం రన్‌వేపై టేకాప్‌ సమయంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ 9డబ్ల్యూ 2374 గోవా ముంబయివిమానం జారిపడింది. ఈ ఘటనలో ప్రయాణీకుల తరలింపులో పలువురికి గాయాలయ్యాయి. విమానంలో సిబ్బంది సహా 154 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించారు.

కోటి నగదు, 2.5 కిలోల గోల్డ్ స్వాధీనం

కన్నూర్, డిసెంబర్ 25: ఆధారాలు లేని రూ.51.86 లక్షల నగదును కేరళ ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు అంతా రూ.2000 నోట్ల రూపంలోనే ఉంది. బెంగళూరు నుంచి వస్తున్న బస్సును ఇరిట్టి దగ్గర అధికారులు ఆపి ఇద్దరు వ్యక్తుల నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని గత మూడు రోజుల్లో నగదు పట్టుబడడం … వివరాలు

ఉత్తరాదిని వణికిస్తున్న చలి

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఉత్తర భారతాన్ని చలి వణికిస్తున్నది.దాదాపు అన్ని రాష్ర్టాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జమ్మూకశ్మీర్ రాష్ట్రం అంతటా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నది. లడఖ్ ప్రాంతంలోని కార్గిల్‌లో శనివారం రాత్రి అత్యధికంగా మైనస్ 9.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. లేహ్‌లో మైనస్ 9.4, పర్యాటక ప్రాంతం గుల్‌మర్గ్‌లో మైనస్ 4.6, పహల్గమ్‌లో … వివరాలు

కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు…

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. 2013 జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అఫడివిట్ తప్పుడు సమాచారం సమర్పించారని కేజ్రీపై కేసు నమోదయింది. ఈ కేసును పలుమార్లు విచారించిన న్యాయస్ధానం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు చెప్పింది. 

12 లక్షల కొత్త నోట్లు.. 430 కిలోల బంగారం..

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు తర్వాత రెవెన్యూ, ఐటీ శాఖ అధికారులు ఇప్పటివరకు చేసిన దాడులన్నింటిలోకీ అతి పెద్ద దాడి తాజాగా ఢిల్లీ, నోయిడాలలో జరిగింది. ఈ దాడిలో ఏకంగా రూ. 120 కోట్ల విలువైన 430 కిలోల బంగారం.. 2.48 కోట్ల పాతనపోట్లు, రూ. 12 లక్షల కొత్తనోట్లు, 80 కిలోల వెండి, 15 కిలోల … వివరాలు

సీఎం విధేయులకు టిక్కెట్ ఖరారు?

లక్నో: రాబోయే అసెంబ్లీ నేపథ్యంలో సీట్ల పంపకంపై ఎస్పీ సుప్రీం ములాయం ఇంట రేకెత్తిన మరో రాజకీయ సంక్షోభంపై ఏ నిమిషాన తమకు ఏం జరుగుతుందోనని ఎమ్మెల్యేలందరూ తెగ ఆందోళన చెందుతున్నారు. దీంతో సీట్ల పంపిణీ విషయంలో ఆందోళన చెందకండి మీకు నేనున్నా అంటూ అఖిలేష్ వారికి భరోసా ఇచ్చాడట. శుక్రవారం సమాజ్ వాద్ పార్టీ ఎమ్మెల్యేలతో … వివరాలు

సీఎం పదవి కూడా చిన్నమ్మకే?

చెన్నై : ఇప్పటికే పార్టీ పగ్గాలను చిన్నమ్మకు అప్పగించిన అన్నాడీఎంకే వర్గాలు.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని కూడా ఆమెకే కట్టబెట్టాలని చూస్తున్నాయి. ఈ మేరకు సీనియర్ నాయకులు కొంతమంది కలిసి శశికళను కలిసి.. ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాలని కోరారు. జయలలిత మరణించిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి పన్నీర్ … వివరాలు

ఇక పార్టీలకు కాళ్ళమే

న్యూఢిల్లీ, డిసెంబరు 18: ఎన్నికల వేళ నల్ల ధనంతో చెలరేగిపోయే రాజకీయ పార్టీల దూకుడుకు కళ్లెం పడనుంది. ఈ దిశగా ఎన్నికల సంఘం పలు కీలక సంస్కరణలు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందు పలు ముఖ్యమైన ప్రతిపాదనలను ఉంచింది. వాటిలో ప్రధానమైనది… రూ.2వేలు, అంతకు మించిన గుప్త విరాళాల లెక్క తేల్చడం. … వివరాలు

అతలాకుతలమే హెచ్‌1బీని టచ్‌ చేస్తే..

కంపెనీల్లో ఆందోళన మొదలైంది. తాను అధ్యక్షుడయ్యాక మొదటి 100 రోజుల్లో అమెరికన్లకు ఉద్యోగాల సృష్టికి చర్యలు చేపడతానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక అన్నంతపనీ చేస్తే భారతకు ఏమవుతుంది? ఉద్యోగం కోసం విదేశాల నుంచి వచ్చే వారిని నియంత్రించడం వల్ల అమెరికా ఏ మేరకు లాభపడుతుంది? అధ్యక్ష ఎన్నికలబరిలో దిగినప్పటి నుంచి ట్రంప్‌ … వివరాలు