కేరళకు ఎపి 5కోట్ల విరాళం

అమరావతి,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి ఎపి తరఫున రూ.5 కోట్ల విరాళాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సాయం కోసం ఎదురుచూస్తున్న కేరళ ప్రజలకు విరివిగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నగదు రూపంలోనే కాకుండా నిత్యావసరాలు, ఆహారపదార్దాల రూపంలో విరాళాలు అందించవచ్చిన మంత్రి లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా … వివరాలు

ముంపులో కోనసీమ లంక గ్రామాలు

బిక్కుబిక్కుమంటున్న ప్రజలు ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్ల అప్రమత్తం రాజమహేంద్రవరం,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ):ధవళేశ్వరం వరద నీటి ఉధృతిని పర్యవేక్షించిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.ధవళేశ్వరం ఉధృతిని బట్టి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో నుంచి చేరుతున్న భారీ … వివరాలు

అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌ పేరిట 200 ఎకరాలు

అటాచ్‌ చేయాల్సిందిగా పోలీస్‌ శాఖ సూచన అమరావతి,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): ఆంధప్రదేశ్‌ అగ్రిగోల్డ్‌ కేసులో మరో కీలక అడుగు పడింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను గుర్తించే పనిలో పడ్డారు. అగ్రిగోల్డ్‌ డైరెక్టర్‌ పేరిట ఆస్తులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్టణం జిల్లాల్లో 200 ఎకరాల భూమి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించగా ఈ … వివరాలు

శ్రీవారి సేవలో సిబిఐ డైరెక్టర్‌

తిరుమల,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): తిరుమల శ్రీవారిని సిబిఐ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ వర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అలోక్‌కుమార్‌ దంపతులకు వేద పండితులు ఆశీర్వచంన, శ్రీవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం … వివరాలు

రైల్వేజోన్‌ సాధనకు అంతిమ పోరాటం

– ప్రత్యేక రైల్వేజోన్‌ సాధన సమితి కన్వీనర్‌ జె.వి. సత్యనారాయణమూర్తి విశాఖపట్నం, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్‌ సాధించేందుకు అంతిమ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ‘ప్రత్యేక రైల్వేజోన్‌ సాధన సమితి’ కన్వీనర్‌ జె.వి.సత్యనారాయణ మూర్తి ఇవాళ విశాఖలో తెలిపారు. శుక్రవారం విశాఖపట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరున … వివరాలు

జర్నలిస్టుల హౌజింగ్‌ విధానాలు ప్రకటించాలి: ఎపియుడబ్ల్యుజె

ఏలూరు,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): ఎపియుడబ్ల్యుజె 61వ ఫార్మేషన్‌ డే సందర్భంగా శుక్రవారం పాలకొల్లులోని ఎపియుడబ్ల్యుజె నాయకులు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపియుడబ్ల్యుజె నేతృత్వంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పాత్రికేయుల గృహ నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టమైన విధానం ప్రకటించాలని ఎపియుడబ్ల్యుజె సభ్యులు కోరారు. కార్యక్రమానికి ముందుగా మాజీ … వివరాలు

ఆక్వా పరిశ్రమకు వ్యతిరేకంగా మత్స్యకారుల నిరసన

విశాఖపట్టణం,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): కొత్తరేవు పోలవరం వద్ద నిర్మిస్తున్న సాయి ఆక్వాఫుడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ శుక్రవారం స్థానిక మత్స్యకారులు నిరవధిక దీక్షలు చేపట్టారు. దీనివల్ల వాతావరణం కలుషితం కాగలదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ.. సాయి ఆక్వా ఫుడ్‌ ప్రోసెసింగ్‌ సంస్థను ఏర్పాటు చేస్తే వాతావరణంతో పాటు … వివరాలు

ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ జంట

ఏలూరు,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో వివాహేతర సంబంధమున్న ఓ జంట శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నంద్యాల సురేష్‌, సరోజిని అనే ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోందని స్థానిక సమాచారం. బంధువుల ఇతరులకు వ్యవహారం తెలియడంతో భయంతో వీరు … వివరాలు

దుర్గగుడి ఇవోగా కోటేశ్వరమ్మ బాధ్యతలు

విజయవాడ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): విజయవాడ దుర్గ గుడి ఈవోగా కోటేశ్వరమ్మ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. దేవాలయానికి విచ్చేసిన ఆమెకు దేవస్థానం సిబ్బంది ఘనస్వాగతం పలికారు. కాగా… ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవలే ఆమెను ఇవోగా నియమించారు. గతంలో పనిచేసిన ఇవో పద్మావతి చీర మాయం కారణంగా బదిలీ … వివరాలు

ప్రత్యేక హోదాపై రాజీపడడం లేదు

విపక్షాల్లాగా రాజకీయాలు చేయడం లేదు: మంత్రి విజయవాడ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): రాష్ట్రాన్ని అభివృద్ది చేసే విషయంలో టిడిపి రాజీలేని పోరు చేస్తోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రత్యేక¬దాపై తమకే ఎక్కువ బాధ్యత ఉందని, ఇతరపార్టీల్లాగా రాజకీయలబ్ది కోసం తాము పోరాడడం లేదన్నారు. రాజీలేని పోరాటంలో తమకు ఎవరూ సాటిరారని అన్నారు. వైకాపా, కాంగ్రెస్‌లకు చిత్తశుద్ది … వివరాలు