ఖమ్మం

ఖమ్మం, నల్లగొండల్లో 44 డిగ్రీలు

హైదరాబాద్‌: ఇరు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం ఖమ్మం, నల్లగొండల్లో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం కూడా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని … వివరాలు

భూముల ధరలకు రెక్కలొచ్చాయి..

ఖమ్మం: నాడు బీడు భూములు.. నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. దీంతో భూముల రేట్లకు రెక్కలొచ్చేశాయి. అన్నదాతల మొహంలో సంతోషం కనిపిస్తోంది. దీనికంతటికీ కారణం భక్త రామదాసు ప్రాజెక్టేనంటున్నారు రైతులు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు బంగారు పంటలు పండించే మాగాణిగా మారిపోయింది. అప్పట్లో సాగునీటి … వివరాలు

ఖమ్మం జిల్లా కృష్ణాపురంలోని రెండిళ్లలో చోరీ

ఖమ్మం: జిల్లాలోని ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురంలో శనివారం వరుసగా రెండిళ్లలో చోరీ జరిగింది. ఇళ్లలోకి చొరబడి రూ. 2 లక్షలు విలువచేసే బంగారం, రూ. 20 వేలు నగదును ఎత్తుకెళ్లారు. ఆ ఇళ్ల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా కృష్ణాపురంలోని రెండిళ్లలో చోరీ

ఖమ్మం: జిల్లాలోని ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురంలో శనివారం వరుసగా రెండిళ్లలో చోరీ జరిగింది. ఇళ్లలోకి చొరబడి రూ. 2 లక్షలు విలువచేసే బంగారం, రూ. 20 వేలు నగదును ఎత్తుకెళ్లారు. ఆ ఇళ్ల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీరామనవమిపై అధికారులతో సమీక్ష

భద్రాద్రి.. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలోని చిత్రగుటమండపంలో  ఏప్రిల్ 5న జరగ నున్న శ్రీరామనవమిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్ల కలెక్టర్ రాజీవిగాంధీ హనుమంతు జిల్ల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం….

అక్రమంగా తరలిస్తున్న 2లక్షల గుట్కా

భద్రాద్రికొత్తగూడెం. జిల్లా. కొత్తగూడెం పెద్ద బజారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 2లక్షల రూపాయల విలువ గల గుట్కాల ను పట్టుకున్న  3టౌన్ పోలీసులు

రాములోరి కళ్యాణ బ్రహ్మోత్సవాల ముహూర్తం ఖరారు

భద్రాద్రి: సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ముహుర్తం ఖరారైంది. భద్రాద్రిలోని వైదిక కమిటీ ఈ ముహూర్తాన్ని ఖరారు చేసింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 11 వరకు తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగునున్నాయి. అనంతరం ఏప్రిల్ 5న సీతారాములవారి కళ్యాణం నిర్వహించనున్నట్టు వైదిక కమిటీ తెలిపింది. ఏప్రిల్ 6న రాములవారి మహాపట్టాభిషేకానికి ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.

ఎంవీఐ ఇంటిపై ఏసీబీ దాడులు

కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలో అవినీతి నిరోధక శాఖాధికారులు సోమవారం మెరుపు దాడులకు దిగారు. కొత్తగూడెం ఆర్టీఏ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ)గా పనిచేస్తున్న గౌస్‌పాషా ఇంటిపై ఏసీబీ సోదాలు చేపట్టింది. కొత్తగూడెంలోని ఆయన ఇంటితో పాటు హైదరాబాద్‌, జమ్మికుంటలో ఉన్న బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో పెద్ద … వివరాలు

ఇసుక లారీ ఢీ: ఇద్దరి మృతి

ఖమ్మం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక మండలం సీతంపేట రహదారి పై ఇసుక లారీ బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బట్టుపల్లి గ్రామానికి చెందిన సాంబశివరావు, సతీష్ లుగా పోలీసులు గుర్తించారు.

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు: 10మంది మృతి

కూసుమంచి: ఖమ్మం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వెళ్తున్న యాత్రాజినీ బస్సు అదుపుతప్పి కాల్వలో బోల్తాపడింది ఈ ప్రమాదంలో 10మంది మృతిచెందగా, 18మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌ నుంచి ఆదివారం రాత్రి యాత్రాజినీ బస్సు కాకినాడ బయలుదేరింది. తెల్లవారుజామున 2.30గంటలకు నాయకన్‌గూడెం వద్దకు … వివరాలు