Main

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోం

ఖమ్మం,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): గిట్టుబాటు ధర కల్పించే విధంగా కవిూషన్‌ వ్యాపారులు శ్రద్ధ తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు అన్నారు. చీటికిమాటికి మార్కెట్లో రైతులు ఆందోళనలు చేయకుండా వారి వెన్నంటి ఉండాలన్నారు. ఒకసారి రైతు పంట కొనుగోలు జరిగిన తరువాత పేచీలు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదన్నారు. కార్మికులు, వ్యాపారులు, అధికారులు, … వివరాలు

పాలేరు జలాశయం నుంచి ఖమ్మం తాగునీటికి ప్రణాళిక

ఖమ్మం,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): మిషన్‌ భగీరథ పట్టణ విభాగంలో ఎంపికయిన ఖమ్మంలో మంచినీటి అవసరాల కోసం పాలేరు జలాశయం నుంచి నీటిని సరఫరా చేస్తారు.పాలేరు నుంచి మంచినీటిని ఖమ్మం నగరపాలక సంస్థకు నిత్యం సరఫరా చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. మరోవైపు పాలేరు జలాశయంలో నీరు వృధాగా పోకుండా వర్షాకలంలో నీటి మళ్లింపును పూర్తిగా వినియోగిస్తారు. ఈ ట్యాంకులను … వివరాలు

ఖమ్మం పత్తి మార్కెట్‌కు ఒకేరోజు 20వేల బస్తాలు 

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి బస్తాలు సోమవారం వెల్లువెత్తాయి. ఒక్కరోజులో సుమారు 20వేల బస్తాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పత్తికి ఈ ఏడాది క్వింటాకు రూ.4,320 మద్దతు ధర ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యమైన పత్తిని వ్యాపారులు క్వింటా రూ.4,400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర చాలా తక్కువ నిల్వలకు … వివరాలు

నగరపాలక అభివృద్ధి పనులపై మంత్రి సవిూక్ష

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ఖమ్మం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సవిూక్షించారు. నగరంలోని ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శంకుస్థాపనలు చేసి ఇప్పటికీ ప్రారంభించని పనులను వెంటనే చేపట్టాలని, పనులు ప్రారంభించని గుత్తేదారులపై … వివరాలు

గిరిజనుల భూములపై పెత్తనం తగదు

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): భద్రాచలం ఏజెన్సీలోని అనేక మండలాల్లో దొడ్డిదారిన ప్రభుత్వ భూములను గిరిజనేతరులకు అధికారులు ధారాదత్తం చేస్తున్నారని ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోపించారు. గిరిజనుల సాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 1/70 చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేస్తున్న గిరిజనేతరులపై ఎల్‌టీఆర్‌ కేసులు … వివరాలు

సింగరేణిలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం

తెబొగకాసం విఫలం అయ్యిందంటున్న విపక్ష కార్మిక సంఘాలు ఖమ్మం,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): సింగరేణిలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. గుర్తింపు సంఘం తెబొగకాసం గత నాలుగైదేళ్లుగా ఇక్కడి సమస్యలను పరిష్కరించలేదని, అలాగే సిఎం కెసిఆర్‌ వద్దకు సమస్యలను తీసుకుని వెళ్ల లేకపోయిందని వివిధ సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తెబొగకాసం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని హెచ్చెమ్మెఎస్‌, ఏఐటీయూసీ,సిఐటియూ తదితర సంఘాలు … వివరాలు

రోడ్డుపై లారీలు నిలిపినందుకు అద్దాలు ధ్వంసం

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్టు30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీసులు రెచ్చిపోయారు. రోడ్డుపై నిలిపారంటూ 50 లారీల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. బూర్గంపాడు మండలం సారపాకలో ఐటీసీ పేపర్‌ బోర్డుకు ముడి సరుకులను లారీలు పెద్దఎత్తున తీసుకువచ్చాయి. లారీలతో … వివరాలు

జిల్లాలో వైద్యాధికారుల అప్రమత్తం

  ఖమ్మం,ఆగస్ట్‌30: గోదావరిలో వరద పెరగడంతో మన్యంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లాలో ఉన్న 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా తదితర కేసులు నమోదయితే చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో గతంలో 60 ప్రాథమిక ఆరోగ్య … వివరాలు

జిల్లావ్యాప్తంగా మొత్తం 394 రైతు సమన్వయ కమిటీలు

సర్వే కోసం కసరత్తు చేస్తున్న అధికారులు మహిళా రైతులకు కూడా అవకాశం ఖమ్మం,ఆగస్ట్‌30: భూసర్వేలో భాగంగా ఖమ్మం జిల్లావ్యాప్తంగా మొత్తం 394 రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. గ్రామస్థాయిలో 372, మండల స్థాయిలో 21, జిల్లాస్థాయిలో 1 చొప్పున కమిటీ ఏర్పాటు కానుంది. ప్రతి కమిటీకి ఓ కోఆర్డినేటర్‌ను నామినేషన్‌ పద్ధతిలో ప్రభుత్వం ఎంపిక … వివరాలు

21నుంచి శరన్నవరాత్రి వేడుకలు?

భద్రాచలం,ఆగస్ట్‌30: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఏటా నిర్వహించే ఉత్సవాల్లో బాగంగా ఈ యేడు సెప్టెంబర్లో దసరాకు ముందు ఉత్సవాలను ప్రారంభిస్తారు. శరన్నవరాత్రి మ¬త్సవాలు వచ్చేనెల 21 నుంచి జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే భద్రాద్రిలో ముక్కోటిని కూడా ఘనంగా జరుపుతారు. డిసెంబర్‌ 29న ముక్కోటి వేడుక జరగనుంది. ఈ మేరకు ముక్కోటికి … వివరాలు